Bhagavanth Kesari : భగవత్ కేసరి నుండి 'ఉయ్యాల ఉయ్యాల' సాంగ్ రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'భగవత్ కేసరి' సినిమా సెకండ్ సాంగ్ సింగిల్ రిలీజ్ అయింది. 'ఉయ్యాల ఉయ్యాల' అంటూ సాగే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ సాంగ్ తెలంగాణ జానపద సాంగ్స్ మోడ్ లో ఉంది. థమన్ సంగీతం అందించిన ఈ పాటని ఎస్పీ చరణ్ పాడారు.
అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాయగా, భాను డ్యాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది.
ఇక ఈ సినిమా ట్రైలర్ ని కూడా ఈనెల 8న వరంగల్‌లో భారీగా ఫంక్షన్ ఏర్పాటు చేసి ట్రైలర్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం.
Details
టీజర్ తో సినిమాపై హైప్ పెంచేసిన డైరక్టర్
భగవంత్ కేసరి నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఈ సినిమాను అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా దసరా కానుగా మూవీ మేకర్స్ విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీ లీల, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.