LOADING...
V. Shantaram Biopic: వి. శాంతారామ్ బయోపిక్ అప్‌డేట్.. తమన్నా హీరోయిన్‌గా కన్ఫర్మ్.. ఫస్ట్ లుక్ రిలీజ్! 
వి. శాంతారామ్ బయోపిక్ అప్‌డేట్.. తమన్నా హీరోయిన్‌గా కన్ఫర్మ్.. ఫస్ట్ లుక్ రిలీజ్!

V. Shantaram Biopic: వి. శాంతారామ్ బయోపిక్ అప్‌డేట్.. తమన్నా హీరోయిన్‌గా కన్ఫర్మ్.. ఫస్ట్ లుక్ రిలీజ్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 09, 2025
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే పేరు, ప్రముఖ దర్శకుడు-నటుడు-నిర్మాత వి. శాంతారామ్‌ (V. Shantaram) జీవితగాథ త్వరలో వెండితెరపై ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆయన అద్భుతమైన సినీ ప్రయాణాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో భారీ స్థాయిలో ఒక బయోపిక్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ బయోగ్రాఫికల్ డ్రామాకు 'వి. శాంతారామ్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో వి. శాంతారామ్ పాత్రను బాలీవుడ్ యువ నటుడు సిద్దాంత్ చతుర్వేది (Siddhant Chaturvedi) పోషించనున్నాడు. అభిజీత్ శిరీష్ దేశ్‌పాండే దర్శకత్వం వహిస్తుండగా, ఇప్పటికే సిద్దాంత్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

Details

చిత్రాన్ని నిర్మిస్తున్న రాహుల్ కిరణ్ శాంతారామ్, సుభాష్ కాలే, సరిత అశ్విన్

తాజాగా చిత్రబృందం కథానాయికను ప్రకటించింది. ఈ బయోపిక్‌లో హీరోయిన్‌గా తమన్నా భాటియా ఎంపికయ్యారు. ఆమె ఫస్ట్ లుక్‌ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. రాహుల్ కిరణ్ శాంతారామ్, సుభాష్ కాలే, సరిత అశ్విన్ వర్దే ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ బయోపిక్‌లో వి. శాంతారామ్‌ సినీ ప్రయాణం, మూకీ సినిమాల యుగం నుంచి టాకీలు, అనంతరం రంగుల సినిమాల దశ వరకు ఆయన చేసిన వినూత్న ప్రయోగాలు, దర్శకుడిగా-నిర్మాతగా సాధించిన ఘనతలను విపులంగా చూపించనున్నారు.

Details

వి. శాంతారామ్ సినీ ప్రస్థానం

1901 నవంబర్ 18న మహారాష్ట్రలోని కోల్హాపూర్‌లో జన్మించిన వి. శాంతారామ్, 1921లో నటుడిగా సినిమాల్లో ప్రవేశించాడు. తరువాత నటనతోపాటు 55కిపైగా చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 1929లో ప్రభాత్ ఫిల్మ్ కంపెనీ, 1942లో రాజ్‌కమల్ కళామందిర్ సంస్థలను స్థాపించి, మొత్తం 92కిపైగా సినిమాలను నిర్మించాడు. భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి 1985లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1992లో మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.

Advertisement