Page Loader
Adikeshava Review: 'ఆదికేశవ' రివ్యూ.. వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా ? ఫట్టా?
'ఆదికేశవ' రివ్యూ.. వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా ? ఫట్టా?

Adikeshava Review: 'ఆదికేశవ' రివ్యూ.. వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా ? ఫట్టా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2023
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్(Vaishnav Tej), ఆదికేశవ సినిమాతో ఫుల్ యాక్షన్‌లోకి దిగిపోయాడు. శ్రీకాంత్ ఎస్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల(Srilila) హీరోయిన్‌గా నటించింది. ఆదికేశవ(Adikesava) సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఇవాళ థియేటర్స్‌లో విడుదలైంది. ఈ చిత్రంతో వైష్ణవ్ తేజ్ విజయం అందుకున్నారా? లేదా? చూద్దాం. శ్రీలీల (చిత్ర) ఓమల్లీనేషనల్ కంపెనీ సీఈఓ. వైష్ణవ్ (బాలు) ఇంటర్వ్యూకి వెళ్లిన సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడతారు. ఈ విషయం తెలిసి శ్రీలీలకు మరో పెళ్లి చేయాలని వాళ్ల తండ్రి అనుకుంటాడు. ఆ తర్వాత బాలుకు వార్నింగ్ ఇస్తుంటే రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే మహా కాళేశ్వర్ రెడ్డి (సుమన్), అన్నయ్య (తనికెళ్ల భరణి) వస్తారు.

Details

ఆదికేశవ లో యాక్షన్ సీన్స్ ను అద్భుతంగా తెరకెక్కించిన డైరక్టర్

అయితే బాలు కోసం సీమ మనషులు ఎందుకొచ్చారు. ఇక సీమలోని చిన్నపిల్లలతో మైనింగ్ చేయించే చెంగారెడ్డికి, బాలుకు మధ్య ఏం జరిగిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బోయపాటి సినిమాలను గుర్తు చేస్తాయి. ఇక పాటల్లో స్టెప్పులు మాస్ జనాలను ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి. ఇందులో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జోడి బావుంది. వైష్ణవ్, సుదర్శన్ మధ్య సీన్లు, కామెడీ టైమింగ్‌ను ఎంజాయ్ చేయోచ్చు. మొత్తానికి ఈ మూవీ కాస్త ఎంటర్టైన్‌మెంట్ గానే ఉంది. బోయపాటి స్టైల్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.