VaishnavTej Adikeshava : ఆదికేశవ మళ్లీ వాయిదా.. రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ స్టార్ వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ఆదికేశవ సినిమా విడుదల మళ్లీ వాయిదా పడింది. ఈ మేరకు నిర్మాత నాగవంశీ ప్రకటన చేశారు.
వరల్డ్ కప్ 2023 సందర్భంగా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
నవంబర్ 24న ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. తొలుత ఈ మూవీని ఆగస్ట్ 18న విడుదల చేయాలని చిత్ర నిర్మాణ బృందం భావించింది. పలు కారణాలతో నవంబర్ 10కి మార్చుతూ నిర్ణయం తీసుకుంది.
అయితే, 15, 16 తేదీల్లో వరల్డ్ కప్ సైమీఫైనల్స్ దృష్య్టా విడుదలను నవంబర్ 24కు వాయిదా వేస్తున్నామన్నారు.
details
అదే రోజు మరో 4 సినిమాలున్నాయి : నాగవంశీ
ఇటీవలే తాను నిర్మించిన 'మ్యాడ్', 'లియో' రెండు చిత్రాలు విడుదలయ్యాయని, వీటి కలెక్షన్లపై క్రికెట్ మ్యాచ్ ప్రభావం పడిందని నిర్మాత నాగవంశీ చెప్పుొచ్చారు.
ఆదికేశవ విడుదల సమయంలోనూ మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ఇదే సమయంలో నవంబర్ 10న మరో నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. దీంతో ఆదికేశవను 24కు వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు.
శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందింది. ఓ గుడి చుట్టూ సాగే కథతో తీర్చిదిద్దారు.
రుద్ర కాళేశ్వర్ రెడ్డి పాత్రలో వైష్ణవ్‌తేజ్ శక్తిమంతంగా కనిపించనున్నారు. మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణాదాస్, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషించారు.