LOADING...
Varanasi Glimpse: జక్కన్న విజన్‌కి ప్రపంచమే షాక్: 'వారణాసి' గ్లింప్స్ బ్లాస్ట్
జక్కన్న విజన్‌కి ప్రపంచమే షాక్: 'వారణాసి' గ్లింప్స్ బ్లాస్ట్

Varanasi Glimpse: జక్కన్న విజన్‌కి ప్రపంచమే షాక్: 'వారణాసి' గ్లింప్స్ బ్లాస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2025
08:50 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ అంచనాలకు తగ్గట్టు రాజమౌళి టీమ్ ఆ వేడుకను నిజంగా అద్భుతమైన స్థాయిలో ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌లో అభిమానులకు ఇచ్చిన పెద్ద సర్ప్రైజ్ ఏమిటంటే... మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదల కావడం. కేవలం ఒక నిమిషం నిడివి ఉన్న ఆ వీడియోలో మొదటి ఫ్రేమ్ నుంచి చివరి సెకనుదాకా రాజమౌళి ఊహాశక్తి మొత్తం స్పష్టంగా కనిపించింది. వాణిజ్య సినిమాల్లో కనిపించే రొటీన్ గ్లో, యాక్షన్‌లకే కట్టిపడకుండా... కథలోని లోతు, పాత్రల భావోద్వేగ ప్రయాణం,కాలాల మార్పులు.. ఇవి అన్నీ చిన్న గ్లింప్స్‌లోనే ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చూపించారు.

వివరాలు 

 బ్లూ టోన్, ఎపిక్ స్కేల్, థ్రిల్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ 

ముఖ్యంగా బ్లూ-గోల్డ్ కలర్ ప్యాలెట్, తీవ్రమైన అంబియన్స్, స్లో-బర్న్ నరేషన్... ఇవన్నీ సినిమాను పూర్తిగా వేరే ప్రపంచానికి తీసుకెళ్లినట్టు అనిపించాయి. అయితే అందరి దృష్టిని గట్టిగా ఆకట్టుకున్న విజువల్ మాత్రం... త్రేతాయుగ యుద్ధ సీన్. కొన్ని క్షణాల పాటు మాత్రమే కనిపించినా, రామ-రావణ యుద్ధాన్ని చూపించిన ఆ ఫుటేజ్ సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ తెచ్చుకుంది. వానరసేన భుజాలపై రాముడిని ఎత్తుకుని యుద్ధానికి తీసుకెళ్తున్న సీన్... బ్లూ టోన్, ఎపిక్ స్కేల్, థ్రిల్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ తో కలిపి నేరుగా గూస్‌బంప్స్ రేపింది. టాలీవుడ్ ప్రముఖులు, విమర్శకులు కూడా ఇదే అంటున్నారు. "ఈ స్థాయి విజువల్ ఐడియా, కథా విస్తృతి... ఇవి జక్కన్న మాత్రమే చేయగలిగే పనులు!" అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

వివరాలు 

 ప్లాట్‌ఫార్మ్‌ల్లో టాప్ ట్రెండ్‌గా #VaranasiGlimpse

ఈ సినిమాలో మహేష్ బాబు 'రుద్ర' పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే తెలుస్తోంది. గ్లింప్స్‌లో ఆయన లుక్ ను పూర్తిగా చూపించకపోయినా... ఆయన యాక్షన్ మోడ్ పూర్తిగా కొత్త రేంజ్‌లో ఉండబోతుందనే స్పష్టమైన హింట్లు అందులో కనిపించాయి. మహేష్ గెటప్, బాడీ లాంగ్వేజ్ ఇప్పటికే ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో #VaranasiGlimpse అన్నీ ప్లాట్‌ఫార్మ్‌ల్లో టాప్ ట్రెండ్‌గా నిలుస్తోంది. అభిమానులు మాత్రమే కాదు, సాధారణ సినిమా ప్రేక్షకులు కూడా... "ఇలాంటి విజన్‌కు ఈ దేశంలో జక్కన్నకే సాటి" "ఇది నిజంగా అంతర్జాతీయ స్థాయి స్కేల్" అంటూ ప్రశంసిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 'వారణాసి' గ్లింప్స్