LOADING...
Varanasi : రాజమౌళి 'వారణాసి'కి భారీ హైప్: హనుమంతుడిగా మాధవన్?
రాజమౌళి 'వారణాసి'కి భారీ హైప్: హనుమంతుడిగా మాధవన్?

Varanasi : రాజమౌళి 'వారణాసి'కి భారీ హైప్: హనుమంతుడిగా మాధవన్?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహేష్ బాబు హీరోగా, ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'వారణాసి' సినిమా అనౌన్స్ అయినప్పటినుంచి సినిమా మీద అంచనాలు ఉన్నాయి. టైటిల్‌ను అధికారికంగా ప్రకటించిన తర్వాత అయితే ఆ హైప్ మరింత పెరిగిపోయింది. టైటిల్‌ను చుట్టూ కొంత వివాదం కొనసాగుతున్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌ నుంచి తరచూ కొత్త అప్డేట్స్ బయటపడుతున్నాయి. ఇదివరకే రాజమౌళి ఈ చిత్రం 2027లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సూచించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర గురించి కూడా చాలా రోజులుగా చర్చ నడుస్తోంది.

వివరాలు 

'వారణాసి' డివోషనల్ టచ్‌తో ఉన్న ఒక యాక్షన్ డ్రామా

ఒక తమిళ స్టార్‌ను తీసుకోబోతున్నారనే రూమర్లు ముందే వచ్చాయి. ఇప్పుడు ఆ హీరోగా మాధవన్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల్లో యువతను విపరీతంగా ఆకట్టుకున్న హీరోగా పేరు తెచ్చుకున్న మాధవన్ ఈ సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్టు తాజా టాక్. అయితే ఈ విషయంపై టీమ్ ఇంకా ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. అయినప్పటికీ, ఆయనను దాదాపు ఫైనల్ చేసినట్టు ఇండస్ట్రీలో ప్రచారం. కావాలనే ఆయన పేరు గోప్యంగా ఉంచి, రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా త్వరలోనే దాన్ని అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక 'వారణాసి' అనేది డివోషనల్ టచ్‌తో ఉన్న ఒక యాక్షన్ డ్రామా.

వివరాలు 

మాధవన్ హనుమంతుడి పాత్ర అంటే.. 

ఇందులో మహేష్ బాబు రాముడి అంశతో ఉన్న రుద్ర అనే పాత్రలో నటించబోతున్నాడు. మాధవన్ ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నారనే వార్తలు గతంలోనే వచ్చినా, సినిమా టీమ్ దాన్ని అంగీకరించలేదు, ఖండించను లేదు. హనుమంతుడి పాత్రకు ఆయనను తీసుకున్నందుకే ఇది అంతా వ్యూహాత్మకంగా రహస్యంగా ఉంచినట్టుగా భావిస్తున్నారు. ప్రస్తుతం వరకు ఈ సినిమాలో మహేష్ బాబుతో కలిసి ప్రియాంక చోప్రా,పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారని మాత్రం అధికారికంగా వెల్లడించారు. మాధవన్ హనుమంతుడి పాత్ర అంటే కచ్చితంగా దానికి అంత పెద్ద క్రేజ్ అయితే రాదు. కానీ రాజమౌళి ఎప్పుడూ పాత్రకు తగ్గట్టే నటులను ఎంచుకుంటారనే సంగతి తెలిసిందే. కాబట్టి ఆయన ఎంపిక వెనుకున్న అసలు కారణం తెరమీదే తెలుస్తుంది.