
#VarunLav: ఓటీటీలో వరుణ్-లావణ్య పెళ్లి వేడుక.. క్లారిటీ ఇచ్చిన టీమ్
ఈ వార్తాకథనం ఏంటి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
ఇటలీలోని టస్కానీలో నవంబర్ 1న వీరి వివాహ వేడుక బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.
ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతోపాటు అతికొద్ది మంది సన్నిహతులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుక మొత్తం ఓటీటీలో ప్రసారం కానుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫిక్స్ రూ.8 కోట్లకు ఈ పెళ్లి వీడియోని కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపించాయి.
తాజాగా దీనిపై వరుణ్ తేజ్ టీం స్పందించింది.
Details
ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం లేదన్న వరుణ్ తేజ్ టీం
వరుణ్ పెళ్లి వీడియోను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం లేదని, అవన్నీ పుకార్లు మాత్రమేనని వరుణ్, లావణ్య పీఆర్ టీమ్ స్పష్టం చేసింది.
ఇక ఇటలీలో పెళ్లి వేడుకకు హజరు కాలేకపోయిన బంధుమిత్రుల కోసం మెగా ఫ్యామిలీ నవంబర్ 5న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించింది.
ఈ రిసెప్షన్ కు జయసుధ, వెంకటేశ్, జగపతిబాబు, మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్, దిల్‌రాజు, సుకుమార్, బోయపాటి శ్రీనివాస్, గుణశేఖర్ పలువురు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు