
Varun Tej - Lavanya: తండ్రి కాబోతున్న వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి.. ఇన్‌స్టా వేదికగా అధికారిక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
మెగా హీరో వరుణ్ తేజ్ తండ్రి కాబోతున్నారు.ఆయన సతీమణి,ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి గర్భవతి అయ్యినట్లు ఈ జంట అధికారికంగా ప్రకటించారు.
తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ప్రత్యేకమైన ఫోటోను షేర్ చేస్తూ.."జీవితంలో అత్యంత అందమైన పాత్రలోకి అడుగులు వేస్తున్నాం - త్వరలో రాబోతుంది" అంటూ హృదయాన్ని తాకే మెసేజ్‌ను జత చేశారు.
వారు పోస్టు చేసిన ఫోటోలో లావణ్య, వరుణ్ తేజ్ ఇద్దరూ చేతులు పట్టుకుని ప్రేమతో నిలబడి ఉన్నారు.
అలాగే, ఆ ఫోటోతో పాటు రెండు చిన్న తెల్లని బూట్ల (బేబీ షూస్) చిత్రం కూడా ఉంది.
ఈ ఫోటో చూసిన వెంటనే అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించడంతో అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వివరాలు
2023 నవంబర్‌లో ఇటలీలో అంగరంగ వైభవంగా పెళ్లి
ఇప్పటికే వీరిద్దరి ప్రేమ,పెళ్లి పట్ల అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది.
వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి జంట 2023 నవంబర్‌లో ఇటలీలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.
ఇప్పుడు తాము తల్లిదండ్రులవుతుండటంతో, జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు.
ఈ శుభవార్తతో మెగా ఫ్యాన్స్ హర్షాతిరేకాలతో స్పందిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా వారిపై శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది.
తొలి సంతానాన్ని స్వాగతించబోయే ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు నుంచి ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు అందుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వరుణ్ తేజ్ చేసిన ట్వీట్
Life’s most beautiful role yet -
— Varun Tej Konidela (@IAmVarunTej) May 6, 2025
Coming soon ♥️♥️♥️ pic.twitter.com/532M5e8muV