
Varun Tej: ఇండో-కొరియన్ హారర్ కామెడీతో వస్తున్న వరుణ్ తేజ్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రాన్ని విభిన్నమైన కాన్సెప్ట్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి దర్శకుడు క్రిష్, వరుణ్ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి, సోదరి నిహారిక హాజరయ్యారు.
చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమా ఇండో-కొరియన్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందనుంది.
Details
హీరోయిన్ గా రితికా నాయక్
యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టాయి. సంగీతాన్ని తమన్ అందించనున్నారు.
ఇదిలా ఉంటే, ఇది వరుణ్ తేజ్ 15వ చిత్రం కానుండగా, ఇందులో ఆయన సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటించనున్నారు.
'ఎక్స్‌ప్రెస్ రాజా', 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఏక్ మినీ కథ' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన మేర్లపాక గాంధీ ఈ ప్రాజెక్ట్‌ను అందిపుచ్చుకున్నాడు.