
వరుణ్,లావణ్యల సంగీత్ ఫోటో చూశారా.. సందడి చేసిన రామ్ చరణ్, అల్లు అర్జున్ దంపతులు
ఈ వార్తాకథనం ఏంటి
మెగా ఫ్యామిలీ మెంబర్ వరుణ్ తేజ్, హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి జంట ఇటలీలో ఒక్కటవుతున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి సంగీత్, కాక్ టైల్ పార్టీ చేసుకున్నారు.
ఇటలీలోని టుస్కానీ నగరంలో నవంబర్ 1న టాలీవుడ్ జంట పెళ్లి పీటలెక్కనున్నారు.ఇప్పటికే మెగా, అల్లు, కామినేని, లావణ్య ఫ్యామిలీలతో పాటు ఈ కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు ఇటలీకి చేరుకున్నారు.
ఈ క్రమంలోనే 4 రోజుల పాటు జరగనున్న పెళ్లి వేడుకల్లో సందడి చేస్తున్నారు. తాజాగా అక్టోబర్ 30న రాత్రి సంగీత్, కాక్ టైల్ పార్టీ చేసుకున్న ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండయ్యాయి.
వేడుకలో భాగంగా అల్లుఅర్జున్, స్నేహారెడ్డి దంపతులు, రామ్ చరణ్,ఉపాసన దంపతులు వరుణ్,లావణ్యలకు శుభాకాంక్షలు చెప్పారు.
details
సంగీత్ పార్టీలో టాలీవుడ్ మెగా ఫ్యామిలీ మస్తు ఎంజాయ్
ఈ ఫోటో ఫ్రేమ్ లో సాయి ధరమ్ తేజ్ సైతం ఉండటం విశేషం. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు మోస్ట్ మెమరబుల్ గా మారాయి.
ఇదే సమయంలో రాత్రి సంగీత్ పార్టీలో టాలీవుడ్ మెగా ఫ్యామిలీ మస్తుగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇవాళ ఉదయం హల్దీ వేడుకలు ముగించుకున్న ఈ జంట, సాయంత్రం మెహందీ ఈవెంట్ నిర్వహించనుంది.
నవంబర్ 1న మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఉంది. అదే రోజు రాత్రి రిసెప్షన్ సైతం నిర్వహించనున్నారు. దీంతో వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి ఫోటోల కోసం తెలుగు నాట ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇటలీలో వరుణ్, లావణ్యల సంగీత్ ఫోటోలు ఇవే
Mega celebrations at Italy 🤩❤️#VarunLav #VarunTej #LavanyaTripati #RamCharan #AlluArjun #Tollywood #TollywoodActor #TeluguActors #Trending #Explore #RedFMTelugu #RedFM pic.twitter.com/DWIMdcERFp
— Red FM Telugu (@RedFMTelugu) October 31, 2023