Page Loader
విదేశాల్లో జాలీగా కొణిదెల, కామినేని ఫ్యామిలీలు.. వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఎక్కడో తెలుసా
వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఎక్కడో తెలుసా.

విదేశాల్లో జాలీగా కొణిదెల, కామినేని ఫ్యామిలీలు.. వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఎక్కడో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 30, 2023
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటలీలో కొణిదెల, కామినేని ఫ్యామిలీలు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నాయి. ఈ మేరకు వరుణ్ తేజ, లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం విదేశాలకు వెళ్లిన, మెగా ఫ్యామిలీ టుస్కానీలో గ్రూప్ ఫోటో దిగింది. ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసన నెట్టింట్లో షేర్ చేసింది. పెళ్లి ఇటలీలో, రిసెప్షన్ హైదరాబాద్‌లో : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక కోసం నటులు రామ్ చరణ్, అల్లు అర్జున్, మిగతా కజిన్స్ ఇటలీ పయనమయ్యారు. ఆదివారం అల్లు అర్జున్ కుటుంబంతో సహా ఇటలీకి బయలుదేరారు. నవంబర్‌ 1న వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కాక్‌టేల్‌ పార్టీతో ప్రారంభం కానున్న వేడుకలు 31న హల్దీ, మెహందీకి ఏర్పాట్లు సిద్ధం చేశారు.

DETAILS

నవంబర్‌ 5న హైదరాబాద్‌ వేదికగా గ్రాండ్ రిసెప్షన్‌  

వివాహం అనంతరం తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ ప్రముఖుల కోసం నవంబర్‌ 5న హైదరాబాద్‌ వేదికగా గ్రాండ్ రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మాదాపూర్‌ N-కన్వెన్షన్‌ లో ఈ వేడుక నిర్వహించనున్నారు. మరోవైపు టస్కానీలో కొణిదెల, కామినేనిలు హాలీడే ట్రిప్ ఎంజాయి చేస్తున్నారు. ఉపాసన షేర్ చేసిన ఫోటోను చూసిన మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఫోటోలో క్లీంకార ముఖాన్ని దాచిపెట్టినా నీటిలో పాప ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తోందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఉప్సీ అక్కా, నీటిలో ప్రతిబింబిస్తున్న క్లీంకార ముఖంపై హార్ట్ ఎమోజీ పెట్టడం మర్చిపోయారని ఓ నెటిజన్ అన్నాడు. పాలల్లో చందమామని చూసినట్లు, నీటిలో క్లింకారని చూశామని మరో అభిమాని రాసుకురావడం గమనార్హం.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

విదేశాల్లో ఎంజాయి చేస్తున్న మెగా ఫ్యామిలీ