తదుపరి వార్తా కథనం

వరుణ్ తేజ్ నటిస్తున్న గాండీవధారి అర్జున టీజర్ రిలీజ్ పై అప్డేట్
వ్రాసిన వారు
Sriram Pranateja
Jul 19, 2023
06:17 pm
ఈ వార్తాకథనం ఏంటి
గని తర్వాత వరుణ్ తేజ్ నుండి గాండీవధారి అర్జున పేరుతో సినిమా వస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుండి ఇప్పటివరకు ప్రీ టీజర్ రిలీజైంది.
ఈ ప్రీ టీజర్ లో బైక్ రేస్, కార్ రేస్ వంటి యాక్షన్ సీక్వెన్సులు కనిపించాయి. వరుణ్ తేజ్ లుక్ కూడా స్టైలిష్ గా ఉంది. అయితే ప్రీ టీజర్ కాబట్టి అందులో సినిమా గురించి ఎక్కువగా రివీల్ చేయలేదు.
తాజాగా గాండీవధారి అర్జున టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. జులై 24న ఉదయం 10:08గంటలకు టీజర్ ని రిలీజ్ చేస్తున్నారు.
సాక్షి వైద్య హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గాండీవధారి అర్జున టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Teaser drops on 24th July @ 10:08am!#GandeevadhariArjuna pic.twitter.com/ZQT4ELzeFw
— Varun Tej Konidela (@IAmVarunTej) July 19, 2023