Page Loader
Matka: వరుణ్ తేజ్ 'మట్కా' నుండి రేపు ఓపెనింగ్ బ్రాకెట్ విడుదల 
Matka: వరుణ్ తేజ్ 'మట్కా' నుండి రేపు ఓపెనింగ్ బ్రాకెట్ విడుదల

Matka: వరుణ్ తేజ్ 'మట్కా' నుండి రేపు ఓపెనింగ్ బ్రాకెట్ విడుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 18, 2024
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మట్కా సినిమాతో పాన్ ఇండియన్ అరంగేట్రం చేస్తున్నాడు. పలాస,శ్రీదేవి సోడా సెంటర్ ఫేమ్ కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల హాయ్ నాన్నను బ్యాంక్రోల్ చేసిన వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల,మోహన్ చెరుకూరి (CVM) ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు. రేపు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా,"ఓపెనింగ్ బ్రాకెట్"పేరుతో ఒక పెద్ద అప్‌డేట్ ఉదయం 11 గంటలకు రానుంది. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ మట్కా. బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి,మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. నవీన్ చంద్ర,కన్నడ కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. GV ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తుండగా,కిషోర్ కుమార్ కెమెరామెన్ గా చేయనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్