Loading...
Varun tej :'ఐదేళ్ల పోరాటం తర్వాత.. ఈ రోజు కథ మారింది'.. వరుణ్ విజయంపై నాగబాబు ఎమోషనల్ పోస్ట్!
'ఐదేళ్ల పోరాటం తర్వాత.. ఈ రోజు కథ మారింది'.. వరుణ్ విజయంపై నాగబాబు ఎమోషనల్ పోస్ట్!

Varun tej :'ఐదేళ్ల పోరాటం తర్వాత.. ఈ రోజు కథ మారింది'.. వరుణ్ విజయంపై నాగబాబు ఎమోషనల్ పోస్ట్!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 09, 2026
02:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఆయన నటించిన సినిమా ఘన విజయాన్ని నమోదు చేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్-కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు' థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన సొంతం చేసుకుంటోంది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.10.2 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి.. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఈ విజయంతో వరుణ్ తేజ్ తండ్రి, నటుడు నాగబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా తన కుమారుడి సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. గత ఐదేళ్లుగా తన కుమారుడు ఎదుర్కొన్న ఒడిదుడుకులను దగ్గరుండి చూశానని తెలిపారు.

వివరాలు

ఐదేళ్ల పోరాటం..

"గత ఐదేళ్లుగా అన్నీ చూస్తూనే ఉన్నాను. నా కొడుకు ఆ నిశ్శబ్దాన్ని, బాధను, నిరాశను తనలోనే మోశాడు.

అయినా ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపలేదు. తన పేరుపై హిట్లు లేకపోయినా.. వరుస వైఫల్యాలు ఎదురైనా అతను ప్రయత్నం ఆపలేదు.

ఆ వైఫల్యాలు తనను ఎంతగా బాధపెట్టాయో నాకు తెలుసు. కానీ ఆ బాధను అతను ఎప్పుడూ బయటకు చెప్పలేదు" అని నాగబాబు తన మనసులోని మాటలను పంచుకున్నారు.

తామిద్దరం మౌనంగానే ఒకరినొకరు ఓదార్చుకునేవాళ్లమని నాగబాబు గుర్తుచేసుకున్నారు.

మాటల్లో చెప్పకపోయినా.. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకునేవాళ్లమని తెలిపారు.

"ఐదేళ్ల పోరాటం తర్వాత.. ఈ రోజు కథ మారింది. ఒక బ్లాక్‌బస్టర్ విజయం దక్కింది.

వివరాలు

కుమారుడి విజయంపై ఎంతో గర్వం..

అయితే ఈ విజయం పూర్తిగా వాడిదే. వాడి పోరాటం, వాడి సహనం, వాడి కష్టం. నేను వాడి కెరీర్‌లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. ఏ క్రెడిట్ కూడా తీసుకోలేదు.

నిన్నటి వైఫల్యాలు ఎలాగైతే తనవో.. ఈ రోజు వచ్చిన విజయం కూడా పూర్తిగా తనదే" అని నాగబాబు పేర్కొన్నారు.

తండ్రిగా తన కుమారుడి విజయంపై ఎంతో గర్వంగా ఉందని నాగబాబు తెలిపారు.

"కంగ్రాట్స్ బంగారు.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది" అంటూ వరుణ్ తేజ్‌ను అభినందించారు.

అదే సమయంలో ఈ విజయానికి కారణమైన దర్శకుడు మేర్లపాక గాంధీ, నటుడు సత్య, నటి రితికా నాయక్, నిర్మాత రాజీవ్, సంగీత దర్శకుడు తమన్‌తో పాటు చిత్రబృందం మొత్తానికి నాగబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న నాగబాబు పోస్ట్..

ADVERTISEMENT