Page Loader
Venkatesh: వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త సినిమా.. 'అబ్బాయిగారు 60'+ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్‌..! 
'అబ్బాయిగారు 60'+ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్‌..!

Venkatesh: వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త సినిమా.. 'అబ్బాయిగారు 60'+ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్‌..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2025
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

విక్టరీ వెంకటేష్ తన విభిన్నమైన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ ఉన్నాడు. ఇటీవల ఆయన నటించిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి భారీ విజయాన్ని నమోదు చేసింది. తాజాగా వెంకటేష్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి కొత్త సినిమా చేయడానికి సన్నద్ధమవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే "నువ్వు నాకు నచ్చావ్", "మల్లీశ్వరి" వంటి కుటుంబ కథా చిత్రాలతో వీరిద్దరూ సూపర్ హిట్ అందుకున్నారు. అయితే అప్పట్లో త్రివిక్రమ్ ఆ సినిమాలకు కథ, మాటలు అందించగా, తాజా సినిమాలో మాత్రం తానే స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు.

వివరాలు 

ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాత్మక చిత్రం

వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో రూపొందబోయే ఈ కొత్త సినిమాకు"వెంకటరమణ" అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ఇటీవల వార్తలు వెలుగుచూశాయి. అయితే తాజాగా ఈ సినిమాకు మరో ప్రత్యేకమైన టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. "అబ్బాయిగారు 60+"అనే టైటిల్‌ను త్రివిక్రమ్-వెంకటేష్ కాంబినేషన్ మూవీకి పరిశీలిస్తున్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందనేది వేచి చూడాల్సిన విషయమే. ఈ చిత్రం పూర్తిగా ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాత్మక చిత్రంగా రూపొందనున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ ఇప్పటికే స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని,ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. మిడిల్ క్లాస్ కుటుంబ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని,భావోద్వేగాలు,హాస్యం సమపాళ్లలో మేళవించే కథను ఈ సినిమాకి రూపొందించినట్లు సమాచారం.

వివరాలు 

త్రివిక్రమ్-త్రిష కాంబినేషన్"అతడు"సినిమా

ఈసినిమాలో హీరోయిన్ ఎంపికపై కూడా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే","ఓం నమో వెంకటేశాయ"వంటి చిత్రాల్లో వెంకటేష్‌కు జోడీగా నటించిన త్రిషను ఈ సినిమాలో కథానాయికగా తీసుకునే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మొదట్లో రుక్మిణి వసంత్ పేరును పరిశీలించినా,ప్రస్తుతం త్రిష పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. త్రివిక్రమ్-త్రిష కాంబినేషన్"అతడు"సినిమా తర్వాత మళ్లీ కలవలేదు.ఇప్పుడు ఆకాంబినేషన్ మరోసారి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని భావిస్తున్నారు. ఈసినిమా షూటింగ్‌ను మూడు నుండి నాలుగు నెలల వ్యవధిలో పూర్తి చేసి,సాధ్యమైనంత త్వరగా థియేటర్లలో విడుదల చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈసినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్,ఎన్టీఆర్‌తో కలిసి మైథాలజికల్ పాన్ ఇండియా ఫాంటసీ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టనున్నట్లు సమాచారం.