LOADING...
Aadarsha-kutumbam: వెంకీ మామ 'ఆదర్శ కుటుంబం'లోకి వీరమల్లు భామ
వెంకీ మామ 'ఆదర్శ కుటుంబం'లోకి వీరమల్లు భామ

Aadarsha-kutumbam: వెంకీ మామ 'ఆదర్శ కుటుంబం'లోకి వీరమల్లు భామ

వ్రాసిన వారు Moogati Shabari
Apr 29, 2026
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

వెంకటేష్ హీరోగా సినిమా వస్తోందంటే ప్రేక్షకులు ముందుగానే కుటుంబ వినోదాన్ని ఆశిస్తారు. అలాంటి సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిస్తే ఆ అంచనాలు మరింత పెరుగుతాయి. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఆదర్శ కుటుంబం'పై ఫిలింనగర్ వర్గాల్లో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రంలో కనిపించిన నటి పూజిత పొన్నాడకు ముఖ్యమైన పాత్ర దక్కినట్లు సమాచారం. అంతేకాదు, ఆమె ఈ సినిమాలో నటుడు నారా రోహిత్‌కు జోడీగా కనిపించనున్నట్లు ప్రచారం సాగుతోంది. త్రివిక్రమ్ సినిమాల్లో సహాయ పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యం ఉండటంతో, ఈ అవకాశం పూజిత కెరీర్‌కు ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వివరాలు

వెంకటేష్ కామెడీ టైమింగ్ అదుర్స్..

ఇక ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. సినిమా చిత్రీకరణ ప్రస్తుతం నిశ్శబ్దంగా కొనసాగుతోంది. సమ్మర్ విడుదల జాబితా నుంచి ఈ చిత్రం తప్పుకున్నప్పటికీ, నాణ్యత విషయంలో మాత్రం దర్శకుడు ఎలాంటి రాజీ పడటం లేదని సమాచారం. సంగీత దర్శకుడి విషయానికి వస్తే, తొలుత హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు వినిపించినా, ఇప్పుడు ఆ స్థానంలో ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ చేరినట్లు తెలుస్తోంది. హారికా హాసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ 'ఆదర్శ కుటుంబం' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. వెంకటేష్ కామెడీ టైమింగ్‌కు త్రివిక్రమ్ శైలిలోని పంచ్ డైలాగులు జతకలిస్తే అభిమానులకు మంచి వినోదం ఖాయం.

Advertisement