Page Loader
Vishal: న్యూయార్క్ రోడ్డుపై అమ్మాయితో వీడియో.. క్లారిటీ ఇచ్చిన విశాల్
న్యూయార్క్ రోడ్డుపై అమ్మాయితో వీడియో.. క్లారిటీ ఇచ్చిన విశాల్

Vishal: న్యూయార్క్ రోడ్డుపై అమ్మాయితో వీడియో.. క్లారిటీ ఇచ్చిన విశాల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2023
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విశాల్(Vishal) వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. రీసెంట్ 'మార్క్ ఆంటోని' సినిమాతో హిట్ కొట్టాడు. ప్రస్తుతం 'రత్నం', 'డిటెక్టివ్ 2' సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం విశాల్ కు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో న్యూయార్క్‌లో అమ్మాయి భుజంపై చేయి వేసుకొని రోడ్డుపై నడుస్తూ కనింపించాడు. అయితే అక్కడ కొందరు గుర్తుపట్టి విశాల్ అని పిలవగానే షర్టుతో తన ముఖాన్ని కవర్ చేసుకొని పారిపోయాడు. దీంతో ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపించాయి. తాజాగా ఆ వీడియోపై విశాల్ స్పందించాడు.

Details

ఫ్రాంక్ వీడియో అని తేల్చేసిన విశాల్

రీసెంట్ వచ్చిన వీడియో గురించి మీ అందరికి నిజం చెప్పాలని, తాను నూయార్క్‌లో ఉన్న మాట వాస్తవమే అని చెప్పారు. తన కజిన్‌తో రెగ్యులర్‌గా చిల్ అయ్యే ప్లేస్ అదేనని, తమ బంధువులందరూ కలిసి క్రిస్మస్ రోజున చిలిపి పని చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు ఇకనైనా మీ డిటెక్టివ్ ఆలోచనలకు ముగింపు చెప్పాలన్నారు. ఇదంతా ప్రాంక్ అని, దీన్ని కొంతమంది టార్గెట్ చేసి మరీ రాశారని, దీన్ని సిరీయస్ గా తీసుకోవట్లేదని, లవ్ యూ ఆల్ అంటూ పోస్టు చేశారు.