Vijay Devarakonda: రౌడీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. విజయ్ దేవరకొండ సినిమాలో బాలీవుడ్ హీరో
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'ఫ్యామిలీ స్టార్' సినిమా తర్వాత ఆయన నుంచి కొత్త సినిమా రాలేదు.
అయితే త్వరలో ఆయన 'శ్యామ్ సింగ రాయ్' ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ కూడా ఉంటుందని, ఆ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కనిపించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశముంది. మొదటి షెడ్యూల్‌లో విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్స్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
Details
కొత్త గెటప్ లో విజయ్
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పూర్తిగా కొత్త గెటప్‌లో కనిపించనున్నాడు.
ముఖ్యంగా అతని లుక్ చాలా విభిన్నంగా ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కథ 1854-78 మధ్యకాలంలో సాగుతుందని, అందుకే కథలో విభిన్న షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది.
అంతేకాకుండా, ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా ఆయన ఇందులో నటిస్తే, సినిమాకు మరింత బలం చేకూరుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంతకుముందు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగ రాయ్' సినిమా ఘన విజయం సాధించింది.
ఇప్పుడు అదే దర్శకుడితో విజయ్ దేవరకొండ సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.