Page Loader
Tollywood-Vijay Devarakonda-Dil Raju: టాలీవుడ్ రౌడీస్టార్ విజయ్ దేవరకొండతో రవికిరణ్ కోలా కొత్త ప్రాజెక్టు
దర్శకుడు రవికిరణ్​ కోలా, నటుడు విజయ్​ దేవరకొండలతో నిర్మాత దిల్​ రాజు

Tollywood-Vijay Devarakonda-Dil Raju: టాలీవుడ్ రౌడీస్టార్ విజయ్ దేవరకొండతో రవికిరణ్ కోలా కొత్త ప్రాజెక్టు

వ్రాసిన వారు Stalin
May 04, 2024
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ రౌడీస్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కొత్త సినిమా ప్రకటించారు. ఇటీవల ఫ్యామిలీ స్టార్ (Family Star) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ సినిమా బాగున్నా కలెక్షన్ల పరంగా నిరాశ ఎదురైంది. దీంతో మరింత పట్టుదలతో ఎలాగైన హిట్ కొట్టాలన్న సంకల్పంతో 'రాజావారు రాణివారు' (Raja varu Rani varu) సినిమా దర్శకుడు రవికిరణ్ కోలా (Ravi Kiran Kola)తో చేతులు కలిపాడు. రవికిరణ్ కోలా చెప్పిన కథకు ఓకే చెప్పిన విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై అగ్రనిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతేడాదే దర్శకుడు రవికిరణ్ ఈ సినిమాను ప్రకటించారు.

Vijay Devarakonda-New Cinema

విజయ్​ బర్త్​ డే సందర్భంగా వివరాలు వెల్లడించనున్న మేకర్స్

అయితే అప్పట్నుంచి ఎటువంటి అప్ డేట్ లేకపోవడంతో విజయ్ అందరూ ఈ ప్రాజెక్టు అటకెక్కేసిందనుకున్నారు. దర్శకుడు తాజా ప్రకటనతో విజయ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రూరల్ యాక్షన్ డ్రామాతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను విజయ్ దేవరకొండ పుట్టినరోజు మే 9 సందర్భంగా అధికారికంగా వెల్లడించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాతో పాటుగా జెర్సీ ఫేం దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో సినిమా చేస్తున్నాడు.