గీత గోవిందం కాంబినేషన్లో వస్తున్న సినిమాకు ముహూర్తం ఫిక్స్: హీరోయిన్ ఎవరంటే
ఈ వార్తాకథనం ఏంటి
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గీత గోవిందం ఘన విజయాన్ని అందుకుని ఇద్దరికీ స్టార్ స్టేటస్ ని తీసుకొచ్చింది.
పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా ఉంటుందని కొన్నిరోజుల క్రితమే ప్రకటన వచ్చింది. ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించనున్నారు.
తాజాగా ఈ సినిమా ఎప్పుడు మొదలవనుందో క్లారిటీ వచ్చేసింది. విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో ప్రతిష్టాత్మకంగా రూపొందబోయే సినిమాను రేపటి నుండి మొదలుపెట్టనున్నారట. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలు కానుందని సమాచారం.
Details
హీరోయిన్ గా సీతారామం బ్యూటీ
ఇంటర్నెట్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయ్యిందని చెప్పుకుంటున్నారు. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన మృణాల్ ఠాకూర్ ని హీరోయిన్ గా తీసుకున్నారని అంటున్నారు.
గతంలో పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. మరి హీరోయిన్ గా ఎవరు ఫిక్స్ అయ్యారనేది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
అదలా ఉంచితే, విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా మరో సినిమాను విజయ్ దేవరకొండ మొదలుపెట్టాడు.