ఖుషి సినిమా ఓటీటీ డీల్స్: ఏ ఫ్లాట్ ఫామ్ లో, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?
విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషి చిత్రం ఈరోజు థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రీమియర్స్ చూసిన నెటిజన్లు ఖుషి సినిమాపై పాజిటివ్ అభిప్రాయాలను వెల్లడి చేస్తున్నారు. అటు థియేటర్లలో ఖుషి సినిమా రిలీజ్ అవ్వగానే ఈ సినిమా ఓటీటీ డీల్స్ గురించి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఖుషి సినిమా ఓటీటీ రైట్స్ కోసం గట్టి పోటీ నడుస్తోందని టాక్ వినిపిస్తోంది. అయితే ఓటీటీ హక్కులను భారీ ధర చెల్లించి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని అంటున్నారు. ఇప్పటివరకు ఈ విషయమై అధికారిక సమాచారం రానప్పటికీ ఇంటర్నెట్లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.
అక్టోబర్ మొదటివారంలో ఓటీటీలోకి ఖుషి
సాధారణంగా ఏ సినిమా అయినా ఓటీటీలో రావాలంటే నెల రోజుల వరకు వేచి చూడాల్సిందే. ఆ లెక్కన ఖుషి సినిమా అక్టోబర్ మొదటి వారంలో ఓటీటీలో అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఖుషి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. మురళీ శర్మ, జయరాం, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించారు.