Page Loader
ఒక్క పోస్ట్ తో అందరికీ ఆసక్తి కలిగించిన విజయ్ దేవరకొండ, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? 
విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫోటో

ఒక్క పోస్ట్ తో అందరికీ ఆసక్తి కలిగించిన విజయ్ దేవరకొండ, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 30, 2023
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా రూపొందిన ఖుషి చిత్రం మరో రెండు రోజుల్లో థియేటర్లలో దర్శనమివ్వబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ తాజాగా నెటిజన్ల ఆసక్తిని తన వైపు మరల్చుకున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విజయ్, రీసెంట్ గా ఒక ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో విజయ్ ఎవరిదో అమ్మాయి చేయి పట్టుకున్నాడు. కేవలం రెండు చేతులు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లుగా కనిపిస్తున్న ఆ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో సంచలనం రేపుతోంది. దానికి ముఖ్య కారణం, ఆ ఫోటోకు క్యాప్షన్ గా.. ఇప్పటివరకు చాలా జరిగాయి ఇది మాత్రం ప్రత్యేకం మరికొద్ది రోజుల్లో ప్రకటించబోతున్నాను అంటూ విజయ్ పెట్టడమే కారణం.

Details

విజయ్ దేవరకొండ పట్టుకున్న చేయి ఎవరిది? 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ గా మారింది. విజయ్ పట్టుకున్న చేయి ఎవరిది? మరికొద్ది రోజుల్లో విజయ్ తాను ప్రేమించిన అమ్మాయిని పరిచయం చేయబోతున్నాడా? ఆ అమ్మాయి రష్మిక మందన్న నేనా అంటూ రకరకాల ప్రశ్నలు ఇంటర్నెట్లో వస్తున్నాయి. కొందరైతే ఖుషి సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఆ ఫోటోను విజయ్ దేవరకొండ షేర్ చేశాడని, ఇది ప్రమోషనల్ ట్రిక్ అని అంటున్నారు. ఏదేమైనా విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫోటో మాత్రం అందరికీ ఆసక్తిగా మారింది. అదలా ఉంచితే, ఖుషి సినిమా పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. పాటలు సూపర్ హిట్ కావడం, ట్రైలర్ వినోదం పంచడంతో సినిమా కూడా బాగుంటుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.