Vijay-Rashmika: ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ,రష్మిక మందన్న నిశ్చితార్థం?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ,రష్మిక మందన్నలు డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, వీరిద్దరూ ఇప్పటి వరకు తమ డేటింగ్ గురించి ఎక్కడా స్పందించలేదు.
న్యూస్ 18 తెలుగుఇటీవల వచ్చిన కథనం ప్రకారం, ఫిబ్రవరి రెండవ వారంలో ఇద్దరూ తమ నిశ్చితార్థానికి సంబంధించిన ప్రకటన చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
అయితే రష్మిక మందన్న కానీ, విజయ్ దేవరకొండ కానీ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
విజయ్ దేవరకొండ,రష్మిక మందన్న జంటగా 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాల్లో నటించారు.
వీరిద్దరూ ఎప్పటినుంచో డేటింగ్‌లో ఉన్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.
గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ,రష్మిక మందన్నల నిశ్చితార్థం గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
Details
విజయ్ ఇంట్లో దీపావళి వేడుకలు చేసుకున్న రష్మిక
ఫిబ్రవరి రెండో వారంలో వీరిద్దరి నిశ్చితార్థం జరగనుందని న్యూస్18 కథనం పేర్కొంది. వారి నిశ్చితార్థంపై ఇంకా అధికారిక ధృవీకరణ లేదు.
తాజాగా రష్మిక హైదరాబాద్‌లోని విజయ్ ఇంట్లో దీపావళి వేడుకలను జరుపుకుంది.
ఇద్దరూ కలిసి విహారయాత్రలకు వెళ్ళారు.వీరిద్దరూ కలిసి ఒకే లోకేషన్‌లో దిగిన ఫోటోలను వేర్వేరుగా పోస్ట్ చేయడంతో ఈ డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది.
రష్మిక మందన్న,యానిమల్'తో బ్లాక్ బస్టర్ సాధించింది.ఇది ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.
రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప: ది రూల్' షూటింగ్‌లో ఉన్నారు.
'రెయిన్‌బో','ది గర్ల్‌ఫ్రెండ్', 'చావా' సినిమాలు చేయాల్సి ఉంది.
విజయ్ దేవరకొండ పరశురామ్ దశకత్వంలో 'ఫ్యామిలీ స్టార్',దర్శకుడు గౌతమ్ తిన్ననూరి 'VD 12'లో సినిమాలు చేస్తున్నారు.