LOADING...
Kingdom: ఓవర్సీస్‌లో విజయ్ దేవరకొండ సందడి.. 'కింగ్‌డమ్' టికెట్ సేల్స్‌తో సరికొత్త రికార్డు!
ఓవర్సీస్‌లో విజయ్ దేవరకొండ సందడి.. 'కింగ్‌డమ్' టికెట్ సేల్స్‌తో సరికొత్త రికార్డు!

Kingdom: ఓవర్సీస్‌లో విజయ్ దేవరకొండ సందడి.. 'కింగ్‌డమ్' టికెట్ సేల్స్‌తో సరికొత్త రికార్డు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2025
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'కింగ్‌డమ్' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 31న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ యాక్షన్ డ్రామాను గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించగా సత్యదేవ్, వెంకటేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించగా,ఆయన మ్యూజిక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్, పాటలు ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ పొందాయి. ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో రికార్డులను తిరగరాసింది.

Details

జులై 30న ప్రీమియర్ షోలు ప్రారంభం

విజయ్ - సత్యదేవ్ మధ్య ఉన్న భావోద్వేగ సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు గగనాన్నంటుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా కూడా రికార్డులు నమోదవుతున్నాయి. బుక్ మై షో వేదికగా ఇప్పటికే లక్షకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు మేకర్స్ ప్రకటించారు. యూఎస్‌లో జులై 30న ప్రీమియర్ షోలు ప్రారంభం కానుండగా, ఇప్పటివరకు 20,000 టికెట్లు సేలైనట్లు సమాచారం. కెనడాలో 1,534 టికెట్లు అమ్ముడయ్యాయని మేకర్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సంఖ్యలన్నీ సినిమాపై ఉన్న హైప్‌ను ప్రతిబింబిస్తున్నాయి.

Details

రగడ్ లుక్ లో విజయ్ దేవరకొండ

'కింగ్‌డమ్'లో విజయ్ మళ్లీ మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో అభిమానుల ముందుకు రాబోతున్నాడు. ట్రైలర్‌లో ఆయన పవర్‌ఫుల్ యాక్షన్ అవతారం, సత్యదేవ్‌తో ఉన్న ఎమోషనల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ మాట్లాడుతూ ఈ సినిమా నా ఫ్యాన్స్‌కి కావాల్సిన విజయాన్ని ఇస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. ఆయనపై అభిమానులు పెట్టుకున్న అంచనాలు మరింత పెరిగాయి. 'లైగర్' తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో, బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం భారీ విజయం సాధించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.