Page Loader
The Family Star: OTT విడుదల తేదీని లాక్ చేసుకున్న విజయ్ దేవరకొండ 'ది ఫ్యామిలీ స్టార్' 
OTT విడుదల తేదీని లాక్ చేసుకున్న విజయ్ దేవరకొండ 'ది ఫ్యామిలీ స్టార్'

The Family Star: OTT విడుదల తేదీని లాక్ చేసుకున్న విజయ్ దేవరకొండ 'ది ఫ్యామిలీ స్టార్' 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 24, 2024
03:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

గీత గోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ పెట్ల కాంబినేషన్‌లో రోపొందిన రెండో చిత్రం 'ది ఫ్యామిలీ స్టార్'. ఈ సినిమా ఈ నెల 5న, థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'ది ఫ్యామిలీ స్టార్' ఏప్రిల్ 26(శుక్రవారం) నుండి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం వాటిని అందుకోలేకపోయింది.

Details 

ప్రేక్షకులు ఫ్యామిలీ డ్రామాని ఎలా రిసీవ్ చేసుకుంటారో..

మరిప్పుడు, ఓటిటి ప్రేక్షకులు ఫ్యామిలీ డ్రామాని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో అభినయ, వాసుకి, రోహిణి హట్టంగడి, రవిబాబు, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

OTTలో విజయ్ దేవరకొండ 'ది ఫ్యామిలీ స్టార్'