
Vijay Leo Ott : విజయ్ 'లియో' నుంచి గుడ్ న్యూస్.. ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పట్నించో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళ దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమా నుంచి ఓటిటి అప్డేట్ వచ్చేసింది.
ఈ మేరకు డెరెక్టరక్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన 'లియో' సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకు వచ్చింది.
విజయ్ సరసన హీరోయిన్ గా త్రిష ఆడిపాడింది. సంజయ్ దత్, గౌతమ్ మీనన్, అర్జున్, మడోన్నా సెబాస్టియన్ సహా ఇతర స్టార్ నటీమణులు మూవీలో ముఖ్య పాత్రల్లో అదరగొట్టారు.
రిలీజ్ కాకముందు నుంచే ఈ సినిమాపై అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే లియో సినిమా థియేటర్లో రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
details
తెలుగులో 30 కోట్లు వసూలు చేసిన లియో
లియో సినిమా దాదాపు 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. తెలుగులోనూ సుమారు 30 కోట్ల వరకు వసూలు చేసి అదుర్స్ అనిపించింది.
లియో నుంచి ఓటిటి తాజా కబురు వచ్చేసింది. లియో సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్'లో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కేవలం ఇండియాలో మాత్రమే నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కావడం విశేషం.
మిగతా దేశాల్లో నవంబర్ 28 నుంచి ఈ 5 భాషల్లో ఓటిటి స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఫలితంగా లియో సినిమాను మరోసారి ఓటిటిలో చూసేందుకు ప్రేక్షకులతో పాటు విజయ్ అభిమానులు సిద్ధం అవుతుండటం గమనార్హం.