vijay Rangaraju: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు విజయ్ రంగరాజు కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ నటుడు విజయ్ రంగరాజు (Vijay Rangaraju) కన్నుమూశారు.
చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
వారం రోజుల క్రితం ఒక సినిమా షూటింగ్‌లో గాయపడిన విజయ్ రంగరాజును చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.
అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో నేడు గుండెపోటు రావడంతో ఆయన మరణించారు.
1994లో విడుదలైన భైరవద్వీపం చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్ రంగరాజు, తెలుగు,తమిళ సినిమాల్లో విలన్, సహాయక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
వివరాలు
వియత్నాం కాలనీ చిత్రంతో సినీరంగ ప్రవేశం
విజయ్ రంగరాజు అసలు పేరు ఉదయ రాజ్‌కుమార్. మోహన్‌లాల్ హీరోగా నటించిన వియత్నాం కాలనీ అనే మలయాళ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు.
ఆ సినిమా విజయం సాధించడంతో వరుసగా కొత్త అవకాశాలు పొందారు.
అదే సమయంలో తెలుగు సినిమాలపై ఆసక్తి చూపుతూ భైరవద్వీపంలో విలన్‌గా నటించే అవకాశం దక్కించుకున్నారు.
ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే ఉదయ రంగరాజు అనే నటుడు ఉన్నందున తన పేరును విజయ్ రంగరాజుగా మార్చుకున్నారు.