VD14 : విజయ్-రష్మిక జోడీ మళ్లీ తెరపైకి? వైరల్ అవుతున్న టాక్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో హిట్ జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మళ్లీ ఒకే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్న వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ జంట గతంలో నటించిన 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలు మంచి విజయాలను సాధించాయి. దీంతో వీరిద్దరూ మరోసారి తెరపై రొమాన్స్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే 'టాక్సీవాలా', 'శ్యామ్ సింగరాయ్' చిత్రాల ద్వారా సొంత గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్, విజయ్ దేవరకొండతో కొత్త సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. టాక్సీవాలా తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈచిత్రం పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి.'వీడీ 14' పేరుతో ప్రాజెక్ట్ ప్రస్థానంలో ఉన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
Details
త్వరలోనే షూటింగ్ మొదలయ్యే అవకాశం
ఈ చిత్రం ఒక హిస్టారికల్ నేపథ్యం ఉన్న కథతో రాయలసీమ నేపథ్యంలో రూపొందనుంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఇక తాజాగా ఈ సినిమాలో కథానాయిక ఎవరు అనే విషయం గురించి ఆసక్తికర సమాచారం వెలువడింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే విజయ్-రష్మిక అభిమానులకు ఇది పండుగే అని చెప్పాలి. ఇక సినిమాల పరంగా విజయ్ దేవరకొండ తాజాగా 'కింగ్‌డమ్' అనే సినిమాతో గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె 'మైసా' అనే చిత్రంలో నటిస్తోంది.