LOADING...
Jana Nayagan: విజయ్‌ 'జన నాయగన్‌'కు మళ్లీ షాక్‌.. స్టే ఇచ్చిన డివిజన్‌ బెంచ్
విజయ్‌ 'జన నాయగన్‌'కు మళ్లీ షాక్‌.. స్టే ఇచ్చిన డివిజన్‌ బెంచ్

Jana Nayagan: విజయ్‌ 'జన నాయగన్‌'కు మళ్లీ షాక్‌.. స్టే ఇచ్చిన డివిజన్‌ బెంచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 09, 2026
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్‌ నటిస్తున్న 'జన నాయగన్‌' సినిమాకు మరోసారి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ ఇవ్వాలని సెన్సార్‌ బోర్డును ఆదేశిస్తూ మద్రాసు హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులతో విజయ్‌ అభిమానులతో పాటు చిత్ర బృందం ఊరట పొందింది. అయితే, ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) మద్రాసు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది.

Details

తాత్కాలిక స్టే విధిస్తూ కీలక ఆదేశాలు

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన డివిజన్‌ బెంచ్‌ సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీపై తాత్కాలిక స్టే విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో, ఈ వ్యవహారంపై తదుపరి విచారణను జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది. దీంతో 'జన నాయగన్‌' సినిమా సెన్సార్‌ ప్రక్రియపై మరోసారి అనిశ్చితి నెలకొంది

Advertisement