Vijay Sethupathi : టాలీవుడ్ డెబ్యూ కోసం విజయ్ సేతుపతి సిద్ధం.. సినిమా ఎప్పుడో మరి..?
తెలుగు ప్రేక్షకుల్లో విజయ్ సేతుపతి తన కంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం ఆయన లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం 'విడుదల పార్ట్ 2' రిలీజ్‌కు సిద్ధమైంది.. ఈ సినిమా ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా, మక్కళ్ సెల్వన్ టీమ్ హైదరాబాద్‌లో ప్రమోషన్లలో భాగంగా సందడి చేసింది. సైరా నరసింహారెడ్డి సినిమాలో కీలక పాత్ర పోషించిన విజయ్ సేతుపతి, ఇంతవరకు లీడ్ రోల్‌లో తెలుగు సినిమాలో నటించలేదు.
విడుదల పార్ట్ 2 పై భారీ అంచనాలు
ఆయన త్వరలో టాలీవుడ్‌లో అడుగు పెట్టే అవకాశం ఉందని స్పష్టంచేశారు. టాలీవుడ్ దర్శకుల నుండి కథలను వింటున్నానని, త్వరలోనే తెలుగు డెబ్యూ జరిగే అవకాశముందని ఆయన ప్రకటించారు. ఇది నిజమైతే, విజయ్ సేతుపతి టాలీవుడ్‌లో ఎలివేట్ చేసే దర్శకుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. 'విడుదల పార్ట్ 2' సినిమాలో విజయ్ సేతుపతితో పాటు, సూరి మరో కీలక పాత్రలో కనిపించనుండగా, మంజు వారియర్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.