
Vijaya Kanth : నటుడు విజయ్ కాంత్ ఆరోగ్యం విషమం.. బులిటెన్ రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ స్టార్ హీరో, DMDK అధినేత విజయ్ కాంత్ ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదలైంది.
అస్వస్థతతో తమిళనాడులోని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గత కొద్ది రోజులుగా ఆయన చికిత్స పొందుతున్నారు.
ఈ మేరకు విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదంటూ వార్తలు వస్తుండటంతో తమిళనాట ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
తాజాగా చెన్నైలోని మయత్ ఆస్పత్రి (MIOT International Hospital) యాజమాన్యం ఆయన ఆరోగ్యపరిస్థితిపై క్లారిటీ ఇచ్చింది.
విజయ్ కాంత్ ఆరోగ్యం కాస్త కుదుటపడినా, గత 24 గంటల నుంచి విషమంగా మారినట్లు వైద్యులు వెల్లడించారు.
చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తున్నా, పరిస్థితి మాత్రం నిలకడగా లేదన్నారు. అతడు కోలుకునేందుకు పల్మనరీ చికిత్సను సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు.
details
ఆందోళనలో డీఎండీకే వర్గాలు
ఆయన కోలుకోవాలంటే మరో 14 రోజుల పాటు నిరంతరం చికిత్స అవసరమన్నారు. విజయ్ కాంత్ ఆరోగ్యం క్షీణించడంతో ఈనెల 18న ఆస్పత్రిలో చేరారు.
హెల్త్ బులిటెన్ విడుదలతో డీఎండీకే వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని, వేగంగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం డీఎండీకే పార్టీ బాధ్యతలను విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం డీఎండీకే కోశాధికారి పదవిలో ఆమె కొనసాగుతున్నారు.
70 ఏళ్ల వయసున్న విజయ్ కాంత్ తమిళ సినీ పరిశ్రమలో ముద్రను వేశారు. అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టి డీఎండీకేని స్థాపించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఆస్పత్రి వైద్య బృందం
A setback to Actor/Political leader #Vijayakanth 's health..
— Ramesh Bala (@rameshlaus) November 29, 2023
Praying for his speedy recovery.. 🙏 pic.twitter.com/vIVFuM5VRR