
Vijaykanth : ఇక సెలవు.. నేడు ప్రభుత్వ లాంఛనాలతో విజయకాంత్ అంత్యక్రియలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ (Vijaykanth) అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి.
చైన్నైలోని మియాత్ ఆస్పత్రిలో గురువారం విజయ్ కాంత్ తుదిశ్వాస విడిచారు.
తమిళనాడు కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.
సాయంత్రం 4.45 గంటలకు ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది.
ఇక విజయ్ కాంత్ మృతితో కోలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది.
Details
భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
1952 ఆగస్టు 25న తమళినాడులోని మధురైలో విజయ్ కాంత్ జన్మించారు.
1979లో విడుదలైన ఇనికి ఇలమై సినిమాతో తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు.
కేవలం హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణించారు. తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు.
ఎన్నికల్లో తన పార్టీ ఓటమి చవిచూసినా రాజకీయాల నుంచి మాత్రం ఆయన వైదొలగలేదు.
ఇక విజయ్ కాంత్ నివాళులర్పించేందుకు పెద్దఎత్తున్న సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.