Thangalan: ఎట్టకేలకు 'తంగలాన్' ఓటీటీకి లైన్ క్లియర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం'తంగలాన్'. ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చినా, ఓటీటీ విడుదల పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. 'తంగలాన్' ఓటీటీ విడుదలను ఆపాలని ప్రజాప్రయోజన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టులో దాఖలు చేశారు. ఈ చిత్రంలో కొన్ని మతాలను కించపరిచినట్లు ఆరోపణలు వచ్చినా,సెన్సార్ సర్టిఫికెట్ పొందిన చిత్రమని,థియేటర్‌లో ఇప్పటికే విడుదలైంది కాబట్టి ఓటీటీ విషయంలో నిర్ణయం తీసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి అడ్డంకులు లేనందున ఓటీటీ విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజగా,ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ వేదికగా తమిళ,తెలుగు,కన్నడ,మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్రమ్‌తో పాటు మాళవిక మోహనన్,పార్వతి తిరువొత్తులు కీలక పాత్రలు పోషించారు.
కథ సారాంశం
1850ల ఆంగ్లేయుల పాలనను నేపథ్యంగా తీసుకున్న ఈ కథ,కర్ణాటక సరిహద్దులోని వేపూరు గ్రామానికి చెందిన గిరిజన నాయకుడు తంగలాన్ జీవిత చుట్టూ తిరుగుతుంది. తంగలాన్ భార్య గంగమ్మతో కలసి ఐదుగురు పిల్లలతో జీవనం సాగిస్తుంటాడు.ఒకసారి వారి పంటను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెడతారు. అదే సమయంలో తెల్లదొర క్లెమెంట్ వేపూరుకు చేరుకొని, అడవిలో బంగారాన్ని వెలికి తీసేందుకు గ్రామస్థులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ బంగారాన్ని నాగజాతికి చెందిన మాంత్రికురాలు ఆరతి తన శక్తులతో రక్షిస్తోందని తంగలాన్‌కు కలలు వస్తాయి. నిజంగా ఆరతి ఉందా?తంగలాన్ బ్రిటిషర్లతో కలిసి అడవిలోకి వెళ్లిన తర్వాత ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఈ ప్రయాణంలో అతను ఏం తెలుసుకున్నాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే, 'తంగలాన్' సినిమాను తప్పక చూడాల్సిందే!