Bhagavanth Kesari : 'భగవంత్ కేసరి'లో విలన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'భగవంత్ కేసరి' విజయ దశమి కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి విలన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఆయన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో 'రాహుల్ సింఘ్వీ'గా అర్జున్ అలరించనున్నారు. స్టైలీస్ షూట్ వేసుకొని, కుర్చీలో రాయల్‌గా కూర్చున్న అతని ఫోటోను చూసి క్లాస్ విలన్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఆక్టోబర్ 19న భగవత్ కేసరి రిలీజ్
ఇక భగవంత్ కేసరి నుంచి మరో అసక్తికర అప్డేట్ వచ్చింది. రేపు రాత్రి 8.16 గంటలకు భగవంత్ కేసరి చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మాతలుగా తెరకెక్కిన ఈ భారీ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల నటిస్తుండగా, తమన్ స్వరాలను అందించాడు. నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు.