
Vin Diesel: హాలీవుడ్ నటుడు విన్ డీజిల్‌పై మాజీ అసిస్టెంట్ లైంగిక ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ హాలీవుడ్ నటుడు విన్ డీజిల్(Vin Diesel) తనను లైంగికంగా వేధించాడని,కొన్ని గంటల తర్వాత ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని అతడి మాజీ సహాయకురాలు అస్టా జొనాసన్ సంచలన ఆరోపణలు చేశారు.
2010లో "ఫాస్ట్ ఫైవ్" చిత్రంలో పని చేస్తున్నప్పుడు విన్ డీజిల్ అట్లాంటా హోటల్ గదిలో తనపై దాడి చేశాడని ఆమె వెల్లడించారు.ఈ మేరకు ఆమె లాస్ ఏంజిల్స్ కోర్టులో దావా వేశారు.
జోనాసన్ తన దావాలో, విన్ డీజిల్ చిత్ర బృందంతో కలిసి అట్లాంటా వెళ్ళినప్పుడు హోటల్ గదిలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తెలిపారు.
Details
సినీ ప్రముఖులపై లైంగిక ఆరోపణలు
అనంతరం ఈ విషయాన్నీవిన్ డీజిల్ సోదరి సమంతా విన్సెంట్‌కి చెప్పిన ఆమె పట్టించుకోలేదని, ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే తనను ఉద్యోగం నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు.
ప్రపంచంలో పేరున్న నటుడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆమెను పరిశ్రమ నుంచి బహిష్కరిస్తారేమోనని భయంతోనే జోనాసన్ చాలా సంవత్సరాలు మౌనంగా ఉందని ఆమె తరుపు న్యాయవాది పేర్కొంది.
2017లో #MeToo ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి ఎంతోమంది సినీ ప్రముఖులపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విన్ డీజిల్‌పై మాజీ అసిస్టెంట్ లైంగిక ఆరోపణలు
Vin Diesel has been sued for alleged sexual battery by an assistant while filming #FastAndFurious5
— Culture Crave 🍿 (@CultureCrave) December 21, 2023
(via @VanityFair) pic.twitter.com/Iqv4ZmsqW8