Page Loader
మరోసారి జతకట్టిన విరూపాక్ష చిత్రబృందం.. దమ్మురేపుతున్న కొత్త సినిమా ప్రీలుక్‌ పోస్టర్‌
దమ్మురేపుతున్న కొత్త సినిమా ప్రీలుక్‌ పోస్టర్‌

మరోసారి జతకట్టిన విరూపాక్ష చిత్రబృందం.. దమ్మురేపుతున్న కొత్త సినిమా ప్రీలుక్‌ పోస్టర్‌

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 14, 2023
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సూపర్ హిట్ చిత్రం విరూపాక్ష సినిమా చిత్రబృందం మరో సినిమాకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే దర్శకుడు కార్తిక్‌ దండు, సుకుమార్‌, నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ల కలయికలో ప్రారంభమైన మరో మూవీకి సంబంధించి తాజాగా పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. అన్వేషణలో భాగంగా ముగ్గురు వ్యక్తులు గుహల్లో వేలాడుతున్నట్లుగా ప్రిలుక్ ను తీర్చిదిద్దారు. అద్భుతమైన నైపుణ్యంతో మలిచిన చిత్ర ప్రీలుక్‌ పోస్టర్‌ విడుదలతో, అందరి దృష్టి ఈ సినిమాపైనే పడేలా డైరెక్టర్ ఆకర్షిస్తున్నారు. తనకు మర్చిపోలేని సక్సెస్‌ ఇచ్చిన జట్టుతోనే కార్తిక్‌ దండు మరోసారి కలిసి పనిచేస్తున్నాడు.ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరో ఎవరనేది ఇప్పటికీ ప్రకటించకపోవడం సస్పెన్స్ ను మరింత పెంచేస్తోంది.

DETAILS

బ్లాక్‌ మేజిక్‌ నేపథ్యంలో తెరకెక్కిన విరూపాక్ష బ్లాక్ బస్టర్

2023 ఏడాదిలో కనకవర్షం కురిపించిన చిత్రాల్లో విరూపాక్ష కూడా నిలిచింది. దాదాపు రూ.50 కోట్ల మార్కెట్‌ లేని మెగా మేనల్లుడిని ఏకంగా వంద కోట్ల హీరో క్లబ్ లో చేర్చింది. బ్లాక్‌ మేజిక్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు కార్తిక్‌ దండు దర్శకుడుగా వ్యవహరించారు. తొలి సినిమా(విరూపాక్ష)తోనే తిరుగులేని విజయం సొంతం చేసుకున్న కార్తిక్, ప్రీ పోస్టర్‌ తో అంచనాలు పెంచేలా చేశాడు.టీజర్‌, ట్రైలర్‌లూ ఆసక్తికరంగా ఉండటంతో ఈ చిత్రం ఎదురులేని రష్ సొంతం చేసుకుంది. ప్రేక్షకుల అంచనాలను అందుకునేందుకు కార్తిక్ విశేష కృషి చేశాడు. టేకింగ్‌ లోనూ, విజన్‌ లోనూ సుకుమార్‌ సహకారంతో విరూపాక్ష బ్లాక్ బస్టర్ గా మారింది. సాయిధరమ్ తేజ్ అద్భత నటనతో సినిమాను విజయతీరాలకు చేర్చాడు.