'కన్నప్ప' షూటింగ్ ఎక్కువ శాతం న్యూజిలాండ్‌లో అందుకే తీస్తున్నా: మంచు విష్ణు
ఈ వార్తాకథనం ఏంటి
మంచు విష్ణు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు 'కన్నప్ప'.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ న్యూజిలాండ్‌లో అద్భుతమైన ప్రకృతి దృశ్యాల మధ్య జరుగుతోంది. దాదాపు 80శాతం షూటింగ్ అక్కడే జరిగేలా సెట్ వేశారు.
అయితే న్యూజిలాండ్‌లోనే ఈ సినిమాను తెరకెక్కించడానికి గల కారణాలను మంచు విష్ణు వివరించాడు.
న్యూజిలాండ్ చాలా మనోహరంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. దేవుడు వేసిన ఉత్తమ పెయింటింగ్ న్యూజిలాండ్ అని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నాడు.
న్యూజిలాండ్ సహజ సౌందర్యం తన సినిమా కన్నప్ప' సినిమాకు సరిగ్గా సరిపోతుందని విష్ణు పేర్కొన్నాడు.
కన్నప్ప
కన్నప్ప కోసం అంతర్జాతీయ టెక్నీషియన్స్
కన్నప్ప తన రెండు కళ్లను శ్రీకాళహస్తీశ్వరలో శివలింగానికి సమర్పించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
అందుకే కన్నప్ప చిత్రాన్ని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రకటించారు. ఈ సినిమాలో విజువల్స్ రిచ్‌గా ఉండేందుకు పలువురు అంతర్జాతీయ టెక్నీషియన్‌లను విష్ణు నియమించారు.
టైటిల్ రోల్‌లో విష్ణు నటిస్తుండగా, ఈ మూవీలో ప్రభాస్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి ప్రముఖ తారలు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై విష్ణు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవస్సీ ఈ సినిమాకు సంగీత దర్శకులు.