Loading...
Vishnu Manchu: ప్రభుదేవా దర్శకత్వంలో విష్ణు మంచు.. తమిళ సినిమాల్లోకి టాలీవుడ్ హీరో ఎంట్రీ!
ప్రభుదేవా దర్శకత్వంలో విష్ణు మంచు.. తమిళ సినిమాల్లోకి టాలీవుడ్ హీరో ఎంట్రీ!

Vishnu Manchu: ప్రభుదేవా దర్శకత్వంలో విష్ణు మంచు.. తమిళ సినిమాల్లోకి టాలీవుడ్ హీరో ఎంట్రీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2026
02:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ నటుడు, నిర్మాత మంచు విష్ణు మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కనున్న ద్విభాషా చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటించనున్నారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకు ప్రస్తుతం '#VM24' అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌తో విష్ణు మంచు తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు. సోమవారం విష్ణు మంచు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.

వివరాలు

సోషల్ మీడియా వేదికగా ప్రభుదేవా ప్రకటన

విష్ణు మంచు పుట్టినరోజు సందర్భంగా ప్రభుదేవా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తన దర్శకత్వంలో తెరకెక్కనున్న 'VM24' సినిమాను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు.

నా హీరో, తమ్ముడు విష్ణు మంచుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. VM24తో ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా, రంగులమయంగా మార్చుకుంటున్నాంటూ ప్రభుదేవా పోస్ట్ చేశారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

వివరాలు

'దీ', 'దేనికైనా రెడీ'తో గుర్తింపు

విష్ణు మంచు ఇప్పటివరకు ప్రధానంగా తెలుగు సినిమాల్లోనే నటించారు. 'దీ', 'దేనికైనా రెడీ', 'దూసుకెళ్తా', 'జిన్నా' వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

చివరిగా ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం 'కన్నప్ప'లో కనిపించారు. మరోవైపు ప్రభుదేవాకు నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఆయన దర్శకుడిగా 2005లో వచ్చిన తెలుగు సినిమా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో ప్రయాణం ప్రారంభించారు.

ఆ తర్వాత 'పోకిరి', 'రౌడీ రాథోడ్', 'వాంటెడ్' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ADVERTISEMENT

వివరాలు

తమిళ భాషపై విష్ణుకి పట్టు 

విష్ణు మంచు తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టడం పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయం కాదని చెప్పొచ్చు.

ఎందుకంటే ఆయన చెన్నైలోనే జన్మించి, అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు.

తమిళ భాషపై మంచి పట్టు ఉండటంతో పాటు, ఆ నగర సంస్కృతి, భాషతో తనకు ఉన్న అనుబంధం గురించి గతంలోనూ మాట్లాడారు.

ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ద్విభాషా చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులకు కూడా తన నటనను పరిచయం చేసే అవకాశం విష్ణు మంచుకు లభించనుంది.

ADVERTISEMENT