Page Loader
Vishwambhara : కేన్స్ లో 'విశ్వంభర' బుక్ రిలీజ్.. అందులో ఏముందంటే..? మెగా ఎపిక్ సినిమాకు గ్లోబల్ అటెన్షన్
కేన్స్ లో 'విశ్వంభర' బుక్ రిలీజ్.. అందులో ఏముందంటే..?

Vishwambhara : కేన్స్ లో 'విశ్వంభర' బుక్ రిలీజ్.. అందులో ఏముందంటే..? మెగా ఎపిక్ సినిమాకు గ్లోబల్ అటెన్షన్

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు చిరంజీవి మీద భారీ షెడ్యూల్స్‌ నిర్వహించారు. ఈ సినిమాకు సంబంధించి ఒక పెద్ద అప్డేట్ త్వరలో రానుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేస్తారని అంతా భావించారు. అయితే, అందరి అంచనాలకు భిన్నంగా, టీజర్‌కి బదులుగా 'విశ్వంభర బుక్'ను విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని నిర్మాత విక్రమ్ తాజాగా ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

వివరాలు 

ఆ బుక్ గురించి వివరణ 

నిర్మాణ సంస్థ ఈ విషయంపై స్పందిస్తూ, "విశ్వంభర మీ ముందుకు ఓ అద్భుతమైన ప్రపంచాన్ని తీసుకొస్తోంది.ఈ బుక్‌లో అసలు ఏముంది అనేది తెలుసుకోవాలంటే ఇంకొంత సమయం వేచిచూడాల్సిందే" అంటూ పేర్కొంది. ఈచిత్రాన్ని సుమారు రూ.200కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.ఈ సినిమా కోసం ఏకంగా 13సెట్లు వేసి, ఒక కొత్త ప్రపంచాన్ని ప్రత్యేకంగా రూపొందించినట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చిరంజీవి కెరీర్‌లో ఇంత పెద్దస్థాయిలో బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇదే అని చెప్పవచ్చు. అందుకే ఈసినిమాపై ప్రేక్షకులు,అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటివరకు ఈచిత్రం నుంచి కేవలం చిన్న గ్లింప్స్ మాత్రమే విడుదలయ్యాయి. అనంతరం రెండు పాటలను రిలీజ్ చేశారు.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విశ్వంభర టీం చేసిన ట్వీట్