Mega Vishwambhara : మెగా 156కి పేరు ఖరారు.. విశ్వంభరగా రానున్న చిరంజీవిembed
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వశిష్ట మల్లిది కాంబోలో ఓ సోషియా ఫాంటసీ సినిమా రూపుదిద్దుకోనుంది. అయితే తాజాగా మెగా 156కి సంబంధించి కీలకమైన అప్‌డేట్ వచ్చింది. తాజాగా ఈ టాలీవుడ్ డెరెక్ట్ సినిమాకు విశ్వంభర పేరును ఖరారు చేశారు. సినిమా కథాంశం మేరకు విశ్వంభర పేరు అయితేనే సరితూగుతుందని చిత్ర దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. విశ్వంభర అంటే పంచభూతాలను తన అధీనంలో నిలుపుకునేవాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్ పంచభూతాలకు సంబంధించిన ఎలిమెంట్స్ తో తయారైంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు, పంచభూతాలకు బలమైన అనుబంధం ఉంటుందని తెలుస్తోంది.
మృణాల్ ఠాకూర్ మెగా హీరోకి జోడిగా నటించనుంది
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే చిరంజీవి వంటి మెగా హీరోకు తాజా టైటిల్ సెట్ అవుతుందని సినిమా వర్గాల్లో అనుకుంటున్నట్లు సమాచారం. యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే దసరా సందర్బంగా పూజా కార్యక్రమాలను పూ్ర్తైంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ రేంజ్ లో తెరకెక్కుతోంది. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ మెగా హీరోకి జోడిగా నటించనుందని సమాచారం. ఛోటా కే నాయుడు కెమెరామెన్ గా పని చేయనున్నారు. మరోవైపు ఆస్కార్ విజేత తెలుగు మ్యాజిక్ దిగ్గజం ఎంఎం కీరవాణి స్వర బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాదికి ప్రేక్షకుల ముందుకు రానుంది.