Thudakkam: సినిమాల్లోకి మోహన్‌లాల్ కుమార్తె విస్మయ.. 'తుడక్కం' ట్రైలర్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ సినీ రంగంలో అడుగుపెడుతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తొలి చిత్రం 'తుడక్కం'. భావోద్వేగాలతో పాటు యాక్షన్ థ్రిల్లర్ అంశాలను మేళవించిన ఈ చిత్రంలో ఆశిష్ జో ఆంటోనీ మరో కీలక పాత్ర పోషించారు. జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వం వహించగా, ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌లో తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.
వివరాలు
కథపై మరింత ఆసక్తి...
"బాగా చదువుకోవాలని ఎంతకాలంగా చెబుతున్నాను. ప్రియను చూడు... ఆమె రాసే ప్రతి పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధిస్తోంది" అనే డైలాగ్ కుటుంబ బంధాన్ని హృద్యంగా చూపిస్తుంది.
అలాగే "నాన్న... ఆరోజు జరిగిన విషయం మర్చిపోండి. అది ఒక తప్పిదం మాత్రమే.
ఇకపై అలాంటి పరిస్థితి రాదు. నీ మాటలు అదుపులో పెట్టుకో... లేదంటే కష్టాలు మీ ఇంటి తలుపు తడతాయి" వంటి సంభాషణలు కథపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
వివరాలు
అతిథి పాత్రలో మోహన్ లాల్..
ట్రైలర్ చివర్లో మోహన్‌లాల్ అతిథి పాత్రలో సీరియస్ లుక్‌లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భావోద్వేగాలతో కూడిన కుటుంబ కథను యాక్షన్ థ్రిల్లర్‌గా మలిచినట్లు ట్రైలర్ స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది.
ఈ చిత్రంలో సాయి కుమార్, బాబీ కురియన్, మనోజ్ కె. జయన్, కేబీ గణేష్ కుమార్, అశ్విన్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు.