Page Loader
Viswaksen-Gangs of Godavari-Teaser: 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ డేట్ వచ్చేసింది

Viswaksen-Gangs of Godavari-Teaser: 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ డేట్ వచ్చేసింది

వ్రాసిన వారు Stalin
Apr 24, 2024
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ నటుడు, మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Viswaksen) మంచి జోరు మీద ఉన్నాడు. ఇటీవలే 'గామి'(Gaami) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విశ్వక్సేన్ తాజాగా మరో సినిమాను లైన్లో పెట్టాడు. 'చల్ మోహన్ రంగ' ఫేమ్ దర్శకుడు కృష్ణ చైతన్య (Krishna Chaithnya) విశ్వక్సేన్ తో రూపొందిస్తున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'(Gangs of Godavari) సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక కొత్త అప్డేట్ బుధవారం బయటికి వచ్చింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా టీజర్ (Teaser) ను ఈ నెల 27న రిలీజ్ చేయనున్నట్లు సినిమా యూనిట్ వెల్లడించింది .

Viswaksen-Gangs of Godavari

కీలక పాత్రలో తెలుగు అమ్మాయి అంజలి

విశ్వక్సేన్, నేహా శెట్టి (Neha Shetti) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే 17న విడుదల కానుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఫిలిం యూనిట్ టీజర్ రిలీజ్ కు సంబంధించి ఈ తాజా అప్డేట్ ను ఇచ్చింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పథకాలపై సూర్యదేవర నాగవంశీ ,సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. తెలుగు హీరోయిన్ అంజలి కీలకపాత్రను ఈ సినిమాలో పోషిస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆయన స్వరపరిచి రిలీజ్ చేసిన పాటలు ఆడియన్స్ ను ఒక ఊపు ఊపుతున్నాయి.