War2: 'వార్2' నుండి సర్‌ప్రైజ్.. 'ఊపిరి ఊయలగా' లవ్ సాంగ్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'వార్ 2'. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్షన్ వహిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటి కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్ వచ్చింది. హృతిక్,కియారా పాడిన రొమాంటిక్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
వివరాలు
స్టైలిష్ లుక్‌తో మెస్మరైజ్ చేస్తున్నహృతిక్
ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. శశ్వంత్ సింగ్, నిఖితా ఈ పాటను ఆలపించారు. ఈ పాటలో హృతిక్ స్టైలిష్ లుక్‌తో మెస్మరైజ్ చేస్తుండగా, కియారా తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రేమ భావోద్వేగాలకు ప్రతిరూపంగా రూపొందిన ఈ సాంగ్, యువత హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేలా ఉంది. ఈ మ్యూజికల్ సర్‌ప్రైజ్‌ను మీరూ తప్పక చూసేయండి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
Feel the love, feel the music... 🎶
— Yash Raj Films (@yrf) July 31, 2025
Groove to the beats of #OopiriOoyalaga 🪩🤍‘cos it’s our favourite @advani_kiara's birthday today! Song out now - https://t.co/XFnAqtB3vB#War2 releasing in Hindi, Telugu & Tamil on August 14th in cinemas worldwide! pic.twitter.com/D14Zwu7FYv