ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, స్పెషల్ గా తెలుగు డాక్యుమెంటరీ
ఈ వార్తాకథనం ఏంటి
మార్చ్ నెల పూర్తి కావస్తోంది. ఈ టైమ్ లో ఓటీటీలో మంచి మంచి సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేకంగా తెలుగు డాక్యుమెంటరీ రిలీజ్ అవుతోంది.
నెట్ ఫ్లిక్ లో రిలీజ్ అయ్యే సినిమాలు:
అమిగోస్: కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాను రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేసారు. ఏప్రిల్ 1 నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
షెహజాదా: అలవైకుంఠపురములో సినిమా హిందీ రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం, ఏప్రిల్ 1నుండి అందుబాటులో ఉంటుంది.
ఆహాలో రిలీజయ్యే కంటెంట్:
సత్తిగాని రెండెకరాలు: పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్ నటించిన ఈ వెబ్ ఫిలిమ్ ఏప్రిల్ 1నుండి అందుబాటులో ఉంటుంది.
ఓటిటి
ఆహాలోకి వస్తున్న తెలుగు డాక్యుమెంటరీ గోదారి
గోదారి: గోదావరి నదీ ప్రాంత ప్రజల ఆచారాలు, సంస్కృతి, అలవాట్లు, పద్దతులు, పండగలు, జీవన విధానాన్ని పరిచయం చేసే డాక్యుమెంటరీ గోదారి. మార్చ్ 31నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
అవతార్ ద వే ఆఫ్ వాటర్: జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుతం, మార్చ్ 28నుండి రెంట్ విధానంలో అందుబాటులో వస్తుంది.
శ్రీదేవి శోభన్ బాబు: సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ఈ సినిమా, థియేటర్ల దగ్గర కనీస కలెక్షన్లు కూడా పొందలేదు. మార్చ్ 30నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
ఆల్ దట్ బ్రీత్స్: డాక్యుమెంటరీ ఫీఛర్ విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయిన ఆల్ దట్ బ్రీత్స్, మార్చ్ 31నుండి స్ట్రీమింగ్ లోకి వస్తుంది.