LOADING...
Ranveer Singh : 'మా జోలికి వస్తే వదిలిపెట్టం'.. ఆపరేషన్‌ సిందూర్‌పై రణ్‌వీర్‌ సింగ్  స్పందన
'మా జోలికి వస్తే వదిలిపెట్టం'.. ఆపరేషన్‌ సిందూర్‌పై రణ్‌వీర్‌ సింగ్ స్పందన

Ranveer Singh : 'మా జోలికి వస్తే వదిలిపెట్టం'.. ఆపరేషన్‌ సిందూర్‌పై రణ్‌వీర్‌ సింగ్  స్పందన

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2025
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ఘటనకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'‌పై దేశమంతా గర్వంగా స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ నటుడు రణ్‌వీర్ సింగ్ చేసిన ఓ పోస్ట్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సైనికుల ధైర్యానికి సెల్యూట్‌ చేస్తూ, దేశ రక్షణ కోసం వారు చేస్తున్న త్యాగాలను గుర్తు చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌కి సంబంధించిన ఓ ఇమేజ్‌ను షేర్ చేసిన రణ్‌వీర్, 'ఎవరి పనులు వాళ్లు చేసుకునే వారిని మేం ఇబ్బంది పెట్టం. కానీ, ఇబ్బందిపెట్టాలని వచ్చేవారిని వదిలిపెట్టమని చెప్పారు.

Details

సోషల్ మీడియా వేదికగా ప్రముఖుల మద్దతు

మన సాయుధ దళాల ధైర్యానికి సెల్యూట్‌ అంటూ పేర్కొన్నారు. అంతేగాక, ఈ ఆపరేషన్‌ను వ్యూహాత్మకంగా నడిపిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆపరేషన్‌ సిందూర్‌కు మద్దతుగా నిలిచారు. టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్, బాలీవుడ్‌ నుంచి అక్షయ్ కుమార్, రిథీష్ దేశ్‌ముఖ్, నిమ్రత్ కౌర్ వంటి వారు సైనికుల సేవలను కొనియాడారు. 'మీ వెంటే మేమున్నాం' అంటూ సోషల్ మీడియా వేదికగా తమ మద్దతు ప్రకటించారు.