Srihari Son Engagement: రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడు శశాంక్ వివాహం ఖరారు!
ఈ వార్తాకథనం ఏంటి
దివంగత టాలీవుడ్ 'రియల్ స్టార్' శ్రీహరి, నటి శాంతి దంపతుల పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఆయన వివాహం నిశ్చయమైనట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీహరి కుటుంబంలో త్వరలోనే పెళ్లి సందడి మొదలుకానుంది. ఇరు కుటుంబాల అంగీకారంతో తమ ఫ్రెండ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో శశాంక్ వివాహం ఖరారైనట్లు సమాచారం. ఈ శుభకార్యానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
వివరాలు
ఫిబ్రవరి 20న నిశ్చితార్థం?
శశాంక్ శ్రీహరి, సంజనల నిశ్చితార్థ వేడుకకు ముహూర్తం కూడా ఖరారైనట్లు సమాచారం.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక జరిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
వివరాలు
శ్రీహరి కుటుంబంలో పెళ్లి సందడి
శ్రీహరి పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఖరారైందన్న వార్తతో టాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాబోయే వధూవరులు శశాంక్, సంజనలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.