Pooja Hegde: 'మీ సమస్య ఏంటి'?.. విలేకరిపై పూజాహెగ్డే ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
పూజా హెగ్డే కథానాయికగా నటించిన బాలీవుడ్ చిత్రం 'దేవా'. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పూజాహెగ్డే, నటుడు షాహిద్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
అగ్ర హీరోల చిత్రాల్లో నటించడంపై పూజాహెగ్డేకు విలేకరి కొన్ని ప్రశ్నలు ఎదురుకాగా, ఆమె కాస్త ఆగ్రహం వ్యక్తం చేసారు.
బాలీవుడ్ అగ్ర హీరోలైన సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించడం అదృష్టం అని మీరు భావిస్తారా? ఈ చిత్రాలకు మీరు అర్హులేనని అనుకుంటున్నారా? అని విలేకరి అడిగాడు.
పూజాహెగ్డే స్పందిస్తూ ఆయా చిత్రాలకు నేను అర్హురాలినే. నిర్మాతలు, దర్శకులు నన్ను ఎంపిక చేసినందుకు వారి వద్ద కొన్ని కారణాలు ఉంటాయి.
Details
పూజా
నేను ఎప్పుడూ పాత్రకు పూర్తిగా న్యాయం చేయడానికి సన్నద్ధమై ఉంటాను. అదృష్టం అనేది జీవితంలో నాకు వచ్చిన ఒక భాగమని భావిస్తా.
మీరు అదృష్టం వల్ల ఈ అవకాశాలు వచ్చాయని అనుకుంటే, నేను బాధపడను. మీరు అలా అనుకుంటే, అలా అనుకోండి అని అసహనం వ్యక్తం చేశారు.
తర్వాత మీరు సినిమాలు ఎలా ఎంచుకుంటారు? స్టార్ హీరోల చిత్రాలే చేస్తారా?" అని ప్రశ్నించగా, పూజాహెగ్డే మరోసారి ఆగ్రహానికి గురయ్యారు. 'మీ సమస్య ఏమిటి'? అని ప్రశ్నించారు.
అప్పుడు షాహిద్ కపూర్ సరదాగా స్పందించారు.
నువ్వు యాక్ట్ చేసిన స్టార్ హీరోలంటే అతడికి ఇష్టం అనుకుంటా. అందుకే నీ నుంచి సలహాలు తీసుకుంటున్నట్లుగా ఉందని జోకులు వేశారు.