LOADING...
Singer Maithili Thakur: అప్పుడు మోదీ ప్రశంసలు.. ఇప్పుడు 'టికెట్' వార్తలు: ఎవరి మైథిలి ఠాకూర్?
అప్పుడు మోదీ ప్రశంసలు.. ఇప్పుడు 'టికెట్' వార్తలు: ఎవరి మైథిలి ఠాకూర్?

Singer Maithili Thakur: అప్పుడు మోదీ ప్రశంసలు.. ఇప్పుడు 'టికెట్' వార్తలు: ఎవరి మైథిలి ఠాకూర్?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2025
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌ శాసనసభ (Bihar Assembly) 2025 ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో,ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల జాబితా పై ప్రచారం మొదలైపోయింది. అందులోభాగంగా జానపద గాయని మైథిలి ఠాకూర్‌ బీజేపీ నుంచి బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఆమె తాజాగా స్పందించారు.

వివరాలు 

ఢిల్లీలో నిత్యానంద్ రాయ్‌తో మైథిలి సమావేశం 

బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ వినోద్ తావ్డే, కేంద్ర హోం సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌తో మైథిలి ఢిల్లీ లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను తావ్డే సోషల్‌ మీడియాలో వెల్లడించారు. అందులో, ఆర్జేడీ నేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మైథిలి కుటుంబం బిహార్‌ను వదిలి వీడినట్లు తెలిపారు. కానీ ప్రస్తుతంలో రాష్ట్రంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని చూసి వారు తిరిగి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు.

వివరాలు 

శబరిని ఉద్దేశిస్తూ మైథిలి పాట.. అభినందించిన ప్రధాని 

ఈ పోస్టుపై స్పందిస్తూ మైథిలి, "బిహార్ కోసం గొప్ప కలలున్న వ్యక్తులను కలవడం ఆనందంగా ఉంది" అని తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఆమెను అభ్యర్థిగా చేయడానికి యత్నిస్తున్నట్లుగా చర్చలు ప్రారంభమయ్యాయి. గతంలో మైథిలి ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు అందుకున్న విషయం కూడా గుర్తుంచుకోవదగినది. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శబరిని ఉద్దేశిస్తూ మైథిలి పాడిన పాటకుగాను ప్రధాని ఆమెను అభినందించారు.

వివరాలు 

ఎన్నికల్లో పోటీపై పాజిటివ్‌గా పరిశీలిస్తా: మైథిలి ఠాకూర్

ఈ వార్తలపై తాజాగా మైథిలి స్పందిస్తూ.. "బీజేపీ తనకు టికెట్ ఇస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని" అన్నారు. అయితే, టికెట్‌ ఇచ్చే విషయం ఇంకా ఖరారు కాలేదన్నారు. పలు కార్య‌క్ర‌మాల్లో భాగంగా తాను అనేకమంది రాజకీయ నాయకులను కలుస్తున్నానని తెలిపారు. నిత్యానంద్ రాయ్‌ను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఎన్నికల్లో పోటీపై వారు ప్రతిపాదన చేస్తే అది పాజిటివ్‌గా పరిశీలిస్తానని ఆమె పేర్కొన్నారు.

వివరాలు 

మైథిలి ఠాకూర్ ప్రారంభ జీవితం,కుటుంబ నేపథ్యం 

భారతీయ జానపద సంగీత రంగంలో ప్రతిభ చూపించిన మైథిలి ఠాకూర్ చిన్న వయసులోనే సంగీతంతో మమేకమయ్యారు. బిహార్ రాష్ట్రం, మధుబనీ జిల్లాలోని బెనిపట్టి గ్రామంలో రమేష్, భారతి ఠాకూర్‌లకు జన్మించిన ఆమెకు సంగీతం కుటుంబ సంప్రదాయం. తండ్రి, తల్లి ఇద్దరు మైథిల్ సంగీతకారులు,సంగీత ఉపాధ్యాయులు. చిన్నతనంలోనే, నాలుగు సంవత్సరాల వయసులోనే తాతగారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. పది సంవత్సరాల వయసులో జాగరణ్‌లు, వివిధ సంగీత కార్యక్రమాల్లో భాగంగా పాడడం ప్రారంభించారు. ఆమెకు ఇద్దరు సోదరులు.. అయచి, రిషవ్.. ఉన్నారు. వీరందరూ తాత, తండ్రి శిక్షణలో మైథిలి జానపద గానం, హార్మోనియం, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, తబలా వంటివి నేర్చుకున్నారు.

వివరాలు 

సంగీతం కెరీర్ 

మైథిలి ఠాకూర్ సంగీత రంగంలో తన ప్రతిభను కనబరుస్తూ గుర్తింపు పొందడం 2011లో జీటీవీ 'లిటిల్ ఛాంప్స్' కార్యక్రమంలో పాల్గొన్న తరువాత ప్రారంభమైంది తర్వాత "ఇండియన్ ఐడల్ జూనియర్" కార్యక్రమంలో తన ప్రతిభ ప్రదర్శించారు. 2016లో "ఐ-జీనియస్ యంగ్ సింగింగ్ స్టార్" పోటీ విజేతగా నిలిచారు. ఈ విజయం తర్వాత యూనివర్సల్ మ్యూజిక్ నుంచి ఆమె మొదటి ఆల్బమ్ "యా రబ్బా" విడుదల అయ్యింది. బిహార్ సంస్కృతిని ప్రతిబింబించే భోజ్‌పురి, మైథిలి, హిందీ భాషలలోని జానపద పాటల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఆమెకు మరింత గుర్తింపు తెచ్చాయి.