LOADING...
Instagram: ఒక్కసారిగా పడిపోయిన సెలబ్రిటీల ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య.. కారణమేంటి?
ఒక్కసారిగా పడిపోయిన సెలబ్రిటీల ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య.. కారణమేంటి?

Instagram: ఒక్కసారిగా పడిపోయిన సెలబ్రిటీల ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య.. కారణమేంటి?

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2026
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రస్తుతం షాక్‌లో ఉన్నారు. ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాలో ఒక్క రాత్రిలోనే మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు కనిపించకుండా పోవడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ అనూహ్య పరిణామం సెలబ్రిటీలను మాత్రమే కాకుండా వారి అభిమానులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొన్ని గంటలుగా సామాజిక మాధ్యమాల్లో ఇదే అంశంపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. పలువురు దీన్ని 'గేట్ర్‌ పర్జ్‌ ఆఫ్‌ 2026' చెబుతున్నారు. ప్రస్తుతం వివిధ ఆన్‌లైన్ నివేదికల ప్రకారం, ఈ వేదికకు చెందిన మాతృసంస్థ మెటా భారీ స్థాయిలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఫేక్‌ ఖాతాలు, యాక్టివ్‌గా లేని ఖాతాలు, బాట్‌ ఖాతాలు తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

14 మిలియన్ల ఫాలోవర్లను కోల్పోయిన వ్యాపారవేత్త

ఈ విషయంపై సంస్థ అధికారిక ప్రకటన చేయకపోయినా, ఫాలోవర్ల సంఖ్యలో భారీ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు తమ అభిమాన తారల ఖాతాలను ఫాలో అయ్యే వారి సంఖ్య తగ్గడాన్ని కొద్ది గంటల్లోనే గమనించారు. అమెరికాకు చెందిన మీడియా వ్యక్తి, వ్యాపారవేత్త కైలీ జెన్నర్ ఏకంగా 14 మిలియన్ల ఫాలోవర్లను కోల్పోయారు. ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో 8 మిలియన్ల ఫాలోవర్లు తగ్గగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా గణనీయంగా ఫాలోవర్లను కోల్పోయారు. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి సుమారు 2 మిలియన్ల తగ్గుదల కనిపించింది.

వివరాలు 

ఈ సెలబ్రిటీ ఖాతాలను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా తగ్గింది

అలాగే అరియానా గ్రాండే, బియాన్సే, టేలర్ స్విఫ్ట్, జస్టిన్ బీబర్, అలాగే దక్షిణ కొరియా సంగీత బృందాలు బీటీఎస్, బ్లాక్‌పింక్ వంటి వారి ఖాతాలను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా తగ్గింది. అనవసర సందేశాల కార్యకలాపాలు, నకిలీ స్పందనలు, థర్డ్ పార్టీ సేవల ద్వారా పెంచిన ఫాలోవర్లను లక్ష్యంగా చేసుకొని ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ వేదికను మరింత విశ్వసనీయంగా మార్చేందుకు కృత్రిమంగా పెంచిన ఫాలోవర్లను తొలగించినట్లుగా పలువురు వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement