LOADING...
Prithviraj Sukumaran: ఇంత నీచానికి దిగజారుతారా..? పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి సంచలన ఆరోపణలు!
ఇంత నీచానికి దిగజారుతారా..? పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి సంచలన ఆరోపణలు!

Prithviraj Sukumaran: ఇంత నీచానికి దిగజారుతారా..? పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి సంచలన ఆరోపణలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2025
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కెరీర్‌ను కావాలనే దెబ్బతీయాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన తల్లి మల్లిక సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడిని ఇండస్ట్రీ నుంచి దూరం చేయడానికి కొన్ని వర్గాలు కుట్ర పన్నుతున్నాయని ఆమె ఆరోపించారు. ఒక మలయాళ మీడియాతో మాట్లాడుతూ మల్లిక ఇలా అన్నారు: పృథ్వీరాజ్‌పై గతంలో దాడులు జరిగినప్పుడు అతడిని సమర్థించడానికి చాలా తక్కువమంది మాత్రమే ముందుకువచ్చారు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అతడిపై దుర్భాషలాడుతున్నారు. పృథ్వీ ఎదగడం కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. అతడి కెరీర్‌ను నాశనం చేయాలని చూస్తున్నారు.

Details

నెగెటివ్ క్యాంపెయిన్ పెరుగుతోంది

ఇంత దిగజారుతారని ఊహించలేదు. ఇది ఆగకపోతే, నేను సందర్భం వచ్చినప్పుడల్లా ఈ అన్యాయానికి ఎదురు పోరాడుతూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన 'విలాయత్‌ బుద్ధ' సందర్భంగా ఈ నెగెటివ్ క్యాంపెయిన్ మరింత పెరిగిందని ఆమె పేర్కొన్నారు. ప్రత్యేకంగా సోషల్ మీడియాలో కొందరు ఈ సినిమాను 'పుష్ప' కథతో పోలుస్తూ పృథ్వీరాజ్‌ను టార్గెట్ చేస్తున్నారని ఆమె అన్నారు. 'విలాయత్‌ బుద్ధ' యాక్షన్ థ్రిల్లర్‌గా జయన్ నంబియార్ దర్శకత్వంలో రూపొందింది. అనుమోహన్, ధ్రువన్, వినోద్ థామస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమా నవంబర్ 21న విడుదలైంది. ఇప్పుడైతే పృథ్వీరాజ్ భారీ ప్రాజెక్ట్ 'వారణాసి'లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement